మెగాస్టార్ తో విబేధాలు.. అది సహజమే.. పోటీ ఉంది అంటూ కుండబద్దలు కొట్టిన అల్లు అరవింద్!

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా సినిమా చూసారు అంటే అది ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని ముందే పసిగట్టేస్తూ ఉంటారు. అయితే అల్లు అరవింద్ తో మెగా ఫ్యామిలీకి కొంత విభేదాలు ఉన్నాయని అనేక రకాల కథనాలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మొదటిసారి ఆయన ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు..

అల్లు అరవింద్ క్లారిటీ

అల్లు అరవింద్ క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవికి అలాగే అల్లు అరవింద్ ఫ్యామిలీ కి మధ్యలో తగాదాలు విభేదాలు ఉన్నాయని అప్పట్లో చాలా రకాల కథనాలు వచ్చాయి. ఇక అదే విషయంపై ఆలీతో సరదాగా షోలో కమెడియన్ ఆలీ అల్లు అరవింద్ ప్రశ్నించారు. ఇక ఆ విషయం పై అల్లు అరవింద్ స్పందిస్తూ సొసైటీలో ఇలా అనుకోవడం అనేది చాలా సహజం అని అన్నారు.

బంధుత్వం కంటే స్నేహం గొప్పది

బంధుత్వం కంటే స్నేహం గొప్పది

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 1980ల కాలం నుంచి కూడా చిరంజీవి గారు మేము ఎంతో క్లోజ్ గా ముందుకు సాగుతూ ఉన్నాము. ఇద్దరి మధ్యలో ఒక మంచి స్నేహం సంబంధం ఉంది. బావ బావమరిది అనే సంబంధం ఉన్నప్పటికీ కూడా మా ఇద్దరి మధ్యలో స్నేహం ఎక్కువగా ఉంటుంది. మంచి స్నేహితులుగా పైకి వచ్చాము. మా కుటుంబాలు పెరిగాయి అలాగే మా పిల్లలు కూడా ఇదే వృత్తిలో ముందుకు సాగుతున్నారు.. అని అన్నారు.

అది నిజమే

అది నిజమే

అయితే ఈ చిన్న ఫిలిం ఇండస్ట్రీలో మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హీరోగా ఎదుగుతున్నప్పుడు అందులోనే వారు అవకాశాలను పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అందులో కాంపిటీషన్ అనేది తప్పదు. అందరూ కూడా కాంపిటీటివ్ పెరుగుతున్నారు అనేది నిజమే.. కానీ ఎవరి స్థానం వారు తీసుకుంటూ పైకి వెళుతున్నారు అనేది మరొక వాస్తవం. ఇక ఇలాంటి విషయంపై ప్రజలు ఆ విధంగా అనుకోవడం సహజమే.. అని అల్లు అరవింద్ తెలిపారు.

వీళ్ళందరూ ఒక్కటే..

వీళ్ళందరూ ఒక్కటే..

కానీ ఇక్కడ ఒక్కటి గమనించాల్సిన విషయం ఏమిటి అంటే.. వీళ్ళందరూ ఒక్కటే.. ఎవరి మీద అయినా ఒక్క మాట పడినా కూడా అందరూ కూడా ఒకే ఒక్క మాట మీద ఉంటారు అనేది ప్రజలకు తెలియడం చాలా అవసరం. ఉదాహరణకు రామలింగయ్య గారి శతజయంతి ఉత్సవాల్లో అందరూ కుటుంబ సభ్యులు వచ్చారు అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు.. అని అల్లు అరవింద్ చెప్పారు.

ఇప్పటికీ కూడా అలానే..

ఇప్పటికీ కూడా అలానే..

అలాగే ఏదైనా పండగ వాతావరణం నెలకొన్నప్పుడు కూడా అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము. ముఖ్యంగా సంక్రాంతి రోజున చిరంజీవి గారి ఇంటికి వెళతాము. దీపావళి రోజున కూడా అందరం కలిసి అన్ని ఫ్యామిలీలు కలిసి చిరంజీవి గారి ఇంటిలోకి చేరి అన్ని రకాల సెలబ్రేషన్ చేసుకుంటాము.

ఇప్పటికీ కూడా అది జరుగుతుంది. ఇవన్నీ ప్రజలకు తెలియడం కోసం అన్ని విషయాలను వీడియోలను మీడియాలో పెట్టలేము కదా.. అని తెలియాల్సి విషయం ఏమిటి అంటే ఈ కాంపిటీషన్లో అందరు కూడా ఎవరి కాంపిటీషన్లో వారు పైకి వస్తున్నారు. వీళ్ళందరూ ఒక్కటే అని అల్లు అర్జున్ చాలా సున్నితంగా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X