twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Aravind : జగన్‌గారూ.. రాజు తలుచుకుంటే వరాలకు కొదవా?.. మీపైనే ఆధారపడ్డాయి, ఆదుకోండి!

    |

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీ మధ్య కొనసాగుతున్న టికెట్ రేట్ల విషయం మీద దాదాపు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే నిన్న దిల్ రాజు సహా బన్నీవాసు లాంటి ఇతర నిర్మాతలు వెళ్లి ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని తో భేటీ అయి వచ్చిన తర్వాత జగన్ ను ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈవెంట్ లో

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈవెంట్ లో


    చాలా గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ చేస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా సిద్ధమైన ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన విడుదల కాబోతోంది. నిజానికి ముందుగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయాల్సి ఉన్నా ఆ తర్వాత దసరా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ లోనే అల్లు అరవింద్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    పరిష్కరించండి ప్లీస్

    పరిష్కరించండి ప్లీస్

    తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. 'రాజు తలచుకుంటే వరాలకు కొదవా? దయచేసి నా విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా మన్నించి సమస్యలు పరిష్కరించండి' అని ఆయన సభా వేదికగా కోరారు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు మీపై ఆధార పడి వుంటాయని వ్యాఖ్యానించారదు. సినీ పరిశ్రమ విజయ వంతంగా కొనసాగేందుకు సహకరించాలని అల్లు అరవింద్ కోరారు. నిజానికి ఏపీ సీఎం జగన్ ను ఇలా సభా వేదికగా కోరిన వారిలో అల్లు అరవింద్ నాలుగో వ్యక్తి.

    చిరంజీవి వినమ్రంగా

    చిరంజీవి వినమ్రంగా


    ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవాలంటూ సీఎం జగన్ ను అభ్యర్ధించారు. కరోనా దెబ్బకు ఇండస్ట్రీ కష్టాల్లో ఉందని..తన ఆచార్య మూవీ షూటింగ్ పూర్తయినా... దానికి పెట్టిన ఖర్చు చూసిన తరువాత తిరిగి వస్తుందో రాదో అనే భయంతో విడుదల చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక ఆయన తర్వాత రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కూడా అదే కోరారు కానీ కోరిన విధానమే ఏపీ ప్రభుత్వానికి కోపం తెప్పించింది.

    పవన్-నాగార్జున సైతం

    పవన్-నాగార్జున సైతం

    తన మీద కోపంతో సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టవద్దన్న పవన్ సినిమా పరిశ్రమ వైపు చూస్తే తాట తీస్తానని కూడా హెచ్చరించారు. అసలే ఇబ్బందుల్లో ఉన్నామని భావించిన తెలుగు ఫిలిం ఛాంబర్ సైతం పవన్ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల సహకారం తమకు కావాలని స్పష్టం చేసింది.ఆ తర్వాత నాగార్జున సైతం లవ్ స్టోరీ సక్సెస్ మీట్ ఏపీ - తెలంగాణ ప్రభుత్వాలు సినీ పరిశ్రమను చల్లగా చూసాయని..ఇప్పుడు కూడా అదే విధంగా చూడాలని కోరారు.

    Recommended Video

    Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
    జగన్ గారు కాస్త చూడండి

    జగన్ గారు కాస్త చూడండి

    ఇక ఇదే విషయం మీద ఇప్పుడు తాజాగా అల్లు అరవింద్ సైతం ఏపీ సీఎం కు ఇదే విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నా విజ్ఞప్తి అంటూ ఆయన తన అభ్యర్ధన వివరించారు. సినీ పరిశ్రమలో అనేక సమస్యలున్నాయని..వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇక అఖిల్‌, పూజా హెగ్డే జంటగా, 'బొమ్మరిల్లు' భాస్కర్‌ తెరకెక్కించిన 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' సినిమాకు గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. జీఏ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, బన్నీ వాస్‌, వాసు వర్మ సినిమాని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల కాగా మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంటోంది.

    English summary
    Producer Allu Aravind requested AP CM Jagan to cooperate with Tollywood on various issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X