twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూమర్లను ఖండించిన అల్లు అరవింద్.. కరోనావైరస్ పాజిటివ్‌పై స్పందించిన అగ్ర నిర్మాత

    |

    టాలీవుడ్ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే వార్త సినీ వర్గాలను, అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై కొన్ని రూమర్లు మీడియాలో వస్తున్న నేపథ్యంలో అల్లు అరవింద్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

    రూమర్లపై అల్లు అరవింద్ క్లారిటీ

    రూమర్లపై అల్లు అరవింద్ క్లారిటీ

    నాకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన మాట నిజమే. ఈ క్రమంలో నాపై వస్తున్న రూమర్లపై నేను స్పందించాలని నిర్ణయం తీసుకొన్నాను. అయితే రెండు వ్యాక్సిన్స్ డోస్ తీసుకొన్న తర్వాత మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అందులో వాస్తవం లేదు. కానీ నేను ఒక వ్యాక్సిన్ డోస్ తీసుకొన్న తర్వాత కరోనావైరస్ బారిన పడ్డాను అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

    వైల్డ్ డాగ్ సినిమా చూసి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.. నాగ్‌పై చిరంజీవి ప్రశంసలు (ఫొటోలు)

    ఇద్దరు స్నేహితులతో కలిసి

    ఇద్దరు స్నేహితులతో కలిసి

    ఇటీవల ఇద్దరు స్నేహితులతో కలిసి ఊరు వెళ్లాను. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత మా ముగ్గురి స్నేహితుల్లో ఇద్దరికి కరోనావైరస్ పాజిటివ్ బారిన పడ్డాను. నాతోపాటు కరోనాబారిన పడిన మరొ స్నేహితుడు హాస్పిటల్ చేరారు, మరొకరికి జ్వరం వచ్చి తగ్గింది అని అరవింద్ తెలిపారు.

    ఎర్ర చీర మూవీ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

    నా స్నేహితుడు వ్యాక్సిన్ వేయించుకోలేదు

    నా స్నేహితుడు వ్యాక్సిన్ వేయించుకోలేదు

    హాస్పిటల్‌లో చేరిన నా స్నేహితుడు వ్యాక్సిన్ చేయించుకోలేదు. మా ముగ్గురిలో నేను, మరో ఫ్రెండ్ వ్యాక్సిన్ చేయించుకొన్నాం. వ్యాక్సిన్ చేయించుకొంటే కరోనా వ్యాధి తీవ్రత అంతగా ఉండదనే తెలిసింది. అందుకు మేమే నిదర్శనం అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

    వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

    వ్యాక్సిన్ వేసుకొంటే ప్రాణహని తప్పుతుందని

    వ్యాక్సిన్ వేయించుకొన్న తర్వాత కూడా చాలా లేటుగా కరోనావైరస్ పాజిటివ్ వస్తున్నది. కాకపోతే తీవ్రత చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉండే స్నేహితుడిని చూసిన తర్వాత నేను ఒక విషయాన్ని చెప్పదలచుకొన్నాను. వ్యాక్సిన్ వేయించుకొంటే ప్రాణహాని తక్కువగా ఉంటుంది. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నాను. కరోనావైరస్ వచ్చిపోతుందని లైట్ తీసుకోవద్దు. తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకొని సురక్షితమైన జీవితాన్ని గడపాలని అల్లు అరవింద్ తెలిపారు.

    English summary
    Telugu States are witnessing the rise of coronavirus positive cases. Amid this Tollywood producer Allu Aravind tested coronavirus positive. But Officially no one confired from producer group or Geeta Arts PR circles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X