అప్పుడు లావణ్య త్రిపాఠి... ఇప్పుడు మృణాల్.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్‌ను శాసించే నలుగురిలో ఒకరిగా, స్టార్ ప్రొడ్యూసర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అరవింద్‌ది చెరగని ముద్ర. సినిమాల రిజల్ట్‌పై ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక ఎంతో ఆలోచన ఉంటుందని ఇండస్ట్రీ జనాలు చెప్పే మాట. నిర్మాతగానే కాకుండా సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గానూ అల్లు అరవింద్ రాణిస్తున్నారు. సినిమాల నిర్మాణం, పంపిణీ, ఆహా ఓటీటీ, అల్లు స్టూడియోస్, అల్లు సినిమాస్‌తో పాటు మరెన్నో వ్యాపారాలు అల్లు అరవింద్ నిర్వర్తిస్తున్నారు. ఆయన అనుభవంతో చెప్పే జోస్యాలు కూడా ఫలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బుల్లితెర నుంచి వెండితెరపై అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు మృణాల్ ఠాకూర్. ఒకప్పుడు యాక్టింగ్ రాదనే విమర్శలతో పాటు బాడీ షేమింగ్‌కు గురైన అమ్మాయి.. పట్టుదల, ప్రతిభతో ఈ స్థాయికి చేరుకుంది. సినిమాల కంటే కూడా వ్యక్తిగత జీవితం, గాసిప్స్‌తో మృణాల్ వార్తల్లో ఉంటారు. అన్నింటిలోకి ఆమె రిలేషన్స్, డేటింగ్స్, ఎఫైర్స్ ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురితో మృణాల్ డేటింగ్ చేసినట్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి.

Allu Aravind s Interesting Comments on Mrunal Thakur Marriage at Dacoit Success Meet

గత కొద్దిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో మృణాల్ ఠాకూర్‌ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ధనుష్ కంటే ముందు శరద్ త్రిపాఠి, అర్జిత్ తనేజా, సిద్ధాంత్ చదుర్వేది, బాద్షా, కుశాల్ టాండన్ తదితరులతో ఆమె రిలేషన్ ఉన్నట్లుగా మీడియా కోడై కూసింది. ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి మాటేత్తకపోవడంతో మృణాల్‌ను మీడియా ఈ విషయంలో తరచుగా ప్రశ్నిస్తూనే ఉంది. ప్రస్తుతం డెకాయిట్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మృణాల్ ఠాకూర్.

షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో సుప్రియా యార్లగడ్డ నిర్మించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడివి శేష్ బ్లడీ డెకాయిట్. ఎంతోమంది టాలెంట్ పీపుల్‌ని చూడటం ఆనందంగా ఉంది. సుప్రియతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటా.. తన కష్టాలు తను చెబుతుంది.

హిట్ అయ్యే వరకు నువ్వు సినిమాను తీస్తూ ఉంటావు. డెకాయిట్ చూసి బయటకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూసిన ఏ సినిమాతో పోల్చుకోవాలని ఆలోచించా. ఏ సినిమా కూడా అందలేదు... క్రైమ్, లవ్‌స్టోరీ మిక్స్ చేసి అద్భుతంగా తీశారు. ప్రేమలో ఒక త్యాగం ఉంది.. ఎండ్‌కి వచ్చే వరకు ఓ ఫీలింగ్ వచ్చింది. దర్శకుడు, ఎడిటర్ అద్భుతంగా సినిమాను అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ పేరు నాకు చాలా ఇష్టం.. అందుకే నువ్వు కూడా నాకిష్టం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ చాలా వెరియేషన్స్ చూపించింది. నేను ఇదివరకు ఒకమ్మాయిని దీవిస్తే.. ఆవిడ వరుణ్‌కి భార్య అయిపోయింది. అలాగే నువ్వు కూడా టాలీవుడ్‌కి చెందిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా. మీరు మాకు కావాలి.. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అరవింద్ .. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కూడా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని దీవించారు. ఆశ్చర్యకంగా ఆయన జోస్యం ఫలించి వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడిన లావణ్య త్రిపాఠి ఏకంగా మెగా ఫ్యామిలీకి కోడలిగా మారిపోయారు. ఇప్పుడు మృణాల్‌ను కూడా అల్లు అరవింద్ అదే విధంగా దీవించడంతో ఆమె కూడా తెలుగింటి కోడలిగా వస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X