Allu Aravind: టాలీవుడ్‌‌లో ఎవరి కుంపటి వాళ్లదే.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటి హాలీవుడ్ రేంజ్‌కి చేరింది. ఇండియాలో అతిపెద్ద చిత్ర పరిశ్రమ టాలీవుడ్ రూల్ చేస్తుంది. బాలీవుడ్ కూడా తెలుగు దర్శకులు, హీరోలు, టెక్నీషియన్స్‌తో పనిచేస్తేనే కానీ నెగ్గుకు రాలేని పరిస్ధితులు నెలకొన్నాయి. వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో టాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడం హిందీ చిత్ర సీమకు సామే. యువ దర్శకులు, హీరోలు కొత్త కొత్త ప్రయోగాలతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థానాన్ని సుస్ధిరం చేస్తున్నారు. అయితే తెలుగు సినీరంగంలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ మధ్య ఐకమత్యం లేదని ఎప్పటి నుంచో వినిపిస్తున్నా మాట.

ఎవరికి వారే యమునా తీరే
తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికీ సత్సంబంధాలు లేవని పెద్దలు చెబుతున్నారు. పైకి అంతా బాగానే ఉన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారని.. కానీ లో లోపల ఇగోలు, పట్టింపులు, పంతాలతో రగిలిపోతున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మా సినిమా బాగా ఆడాలి.. మేమే గొప్ప, మా సినినిమాయే కలెక్షన్స్ కుమ్మేయాలని అనుకునేవారే. సినిమాలను వ్యక్తిగతంగా తీసుకుని తెరవెనుక కొందరు రాజకీయాలకు పాల్పడుతున్నారే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Allu Aravind sensational comments on Tollywood at SIIMA 2025 Event

ఆస్కార్‌ను పిచ్చ లైట్ తీసుకున్న టాలీవుడ్
ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ లభించి తెలుగు సినిమా కాలర్ ఎగరేస్తే .. విజేతలను పట్టించుకునేవారే కరువయ్యారు. చిరంజీవి, బాలకృష్ణలకు పద్మ అవార్డ్స్ వచ్చినప్పుడు.. చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కినప్పుడు కానీ టాలీవుడ్ ఏకమై వారిని సన్మానించాలని కానీ, సత్కరించాలని కానీ అనుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా ఓ ట్వీట్ చేసి వదిలేశారు. పుష్ప సినిమాకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ దక్కింది. 80 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమలో హేమాహేమాలు అనదగ్గ నటులు సాధించలేని ఘనతను అల్లు అర్జున్ సాధిస్తే పట్టించుకునే వారే లేదు. ఇకఈ ఏడాది బన్నీ పుట్టినరోజును కూడా టాలీవుడ్ లైట్ తీసుకుందన్న కామెంట్స్ వినిపించాయి.

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో టాలీవుడ్ హవా
ఈ ఏడాది 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తంగా పలు కేటగిరీలలో 7 అవార్డులు వరించాయి. బలగం, బేబీ, హనుమాన్, భగవంత్ కేసరి వంటి చిత్రాలు పురస్కారాల్లో సత్తా చాటాయి. జాతీయ స్థాయిలో ఇంతటి ఘనత సాధిస్తే కనీసం చిత్ర పరిశ్రమ నుంచి విజేతలకు ఎలాంటి ప్రశంస దక్కకపోవడం పెద్దలను నిరుత్సాహానికి గురిచేస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో నెలకొన్ని ఈ వాతావరణంపై గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Take a Poll

ఎవరి కుంపటి వాళ్లదే
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌లో వచ్చే నెల 5, 6 తేదీలలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో సైమా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ అవార్డుకు ఎంపికైన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'తెలుగులో కల్చర్ కొద్దిగా తక్కువైంది.. అదేంటంటే 7 అవార్డులు మన తెలుగు సినిమాకు వచ్చాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించడానికి ముందే సైమా వారు స్పందించి వారినందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం ప్రశంసనీయం. తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చాయి.. అందులో రెండింటికి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. దీనిని మనమంతా ఒక పండగలా జరుపుకోవాలి. ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా? ఎవరి కుంపటి వాళ్లదే' అని అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X