తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిలైపో.. యంగ్ హీరోయిన్‌కి అల్లు అరవింద్ సలహా

టాలీవుడ్‌లో తాజాగా హాట్ టాపిక్‌గా మారింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి అంశం. 'డెకాయిట్' సక్సెస్ మీట్ వేదికగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన మృణాల్‌ను ఉద్దేశించి 'తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలి'అని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఏమైంది?

'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తాజాగా మారింది. తాజాగా డెకాయిట్ (Dacoit) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తన నటనతో మంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు.

Allu Aravind Suggests Mrunal Thakur Marry a Telugu Man at Dacoit Success Meet

ఈ వేడుకలో ప్రముఖ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ హైలెట్ గా నిలిచాయి.ముందుగా చిత్రబృందాన్ని అభినందిస్తూ హీరో అడివి శేష్ పై ప్రశంసలు కురిపించారు. 'శేష్ నిజంగా ఒక డెకాయిట్ లాంటోడు. మంచి కథలను దొంగిలించి ప్రేక్షకుల మనసులు గెలుస్తున్నాడు' అంటూ సరదాగా మాట్లాడాడు. అలాగే దర్శకుడు షానిల్ డియో పనితీరును కొనియాడుతూ, లవ్ అండ్ క్రైమ్ లను కలిపి అద్భుతంగా ప్రదర్శించారని చెప్పారు.

ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. 'సీతారామం'లో సీతగా అద్భుతంగా చేసింది. దానికంటే మించి ఇంకేం చేయగలదో అనుకున్నా..కానీ, 'డెకాయిట్'లో సరస్వతి పాత్రలో మరింత మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ చూపించింది' అంటూ ఆమె నటనను మెచ్చుకున్నారు. భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తపరిచిందని, తక్కువ సమయంలోనే గొప్ప పేరు సంపాదించుకుందని అన్నారు.

అయితే అసలు హైలైట్ మాత్రం ఆమె పెళ్లిపై చేసిన కామెంట్స్. ఇదివరకు నేను ఒక హీరోయిన్‌ను ఇలాగే ఆశీర్వదించాను... తర్వాత ఆమె మా ఇంటి కోడలైంది'అంటూ లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ వివాహాన్ని ప్రస్తావించారు. 'నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలి. మాకు నువ్వు కావాలి' అని నవ్వుతూ చెప్పారు. ఈ వ్యాఖ్యలతో నవ్వుల పువ్వులు పూశాయి. మృణాల్ కూడా సిగ్గుతో నవ్వుతూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇదిలా ఉండగా, గతంలో మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితంపై పలు రూమర్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, వాటిని ఆమె స్వయంగా ఖండించింది. ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేసింది. అయితే.. అల్లు అరవింద్ వైరల్ కావడంతో మృణాల్ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా? లేక ఇవి సరదా మాటలుగానే మిగిలిపోతాయా? అన్నది కాలమే చెప్పాలి.

Read more about: dacoit mrunal thakur allu aravind
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X