18 Pages: అనుపమ పరమేశ్వరన్ తో అల్లు అరవింద్ డ్యాన్స్.. టైమివ్వు పిల్లా అంటూ!.. వీడియో వైరల్
విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల చేస్తూ వచ్చాడు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో విజయం సాధించాడు. ఈ సినిమా విజయం తర్వాత మళ్లీ అదే హిట్ జోడీగా వచ్చిన మూవీ 18 పేజీస్. ఈ సినిమాలో మరోసారి నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీ విజయం సాధించడంతో మూవీ టీమ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.

సంయుక్త నిర్మాణంలో..
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా కలిసి మరోసారి నటించిన చిత్రం 18 పేజీస్. కరెంట్, కుమార్ 21F వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదలైంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా విజయం సాధించిందని చిత్రబృందం పేర్కొంది.

సినిమా యూనిట్ సంబురాలు..
డిసెంబర్ 23 అంటే శుక్రవారం విడుదలైన 18 పేజీస్ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఇవాళ 18 పేజీస్ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడం, విజయం సాధించిన కారణంగా సంబరాలు చేసుకుంది మూవీ టీమ్. ఈ సెలబ్రేషన్స్ లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్, హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు.

సిగ్నేచర్ స్టెప్పుతో..
ఈ వేడుకల్లో తొలిసారిగా అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్ డ్యాన్స్ చేశారు. అది కూడా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. 18 పేజీస్ చిత్రంలోని కోలీవుడ్ స్టార్ శింబు పాడిన టైమివ్వు పిల్లా కొంచెం టైమివ్వు సాంగ్ లోని సిగ్నేచర్ స్టెప్ వేసి నిర్మాత అరవింద్ మెస్మరైజ్ చేశారు. అతనితోపాటు సుకుమారు కూడా స్టెప్స్ వేశారు. ఈ వీడియోను నిఖిల్ తీసి ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సుకుమార్ శిష్యుడి దర్శకత్వం..
కాగా సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన మరో చిత్రమే ఈ 18 పేజీస్. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ కు బెస్ట్ ఫ్రెండ్ బాగీగా బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ సరయు నటించి ఆకట్టుకుంది. అలాగే మరి కొన్ని పాత్రల్లో సూర్య వెబ్ సిరీస్ ఫేమ్ మౌనిక రెడ్డి, నటుడు అజయ్, అర్జున్ కల్యాణ్, గోపరాజు రమణ, శత్రు తదితరులు నటించారు.
డైరీ ఆధారంగా..
ఒక డైరీ ఆధారంగా పల్లెటూరు అమ్మాయిని హీరో ప్రేమించడం, ఆమె మొహాన్ని చూడకుండా కేవలం ఆమే క్యారెక్టర్ చూసి ఇంప్రెస్ అవ్వడం వంటి సన్నివేశాలు ఇతర సినిమాలను తలపించినా 18 పేజీస్ సినిమాలో కొత్తదనం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటన సినిమాకు బాగా కలిసొచ్చే అంశమని కూడా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











