Revanth Reddy సినీ పరిశ్రమకు ఎప్పడూ కాంగ్రెస్ అండనే.. త్వరలోనే సీఎంను కలుస్తాం.. అల్లు అరవింద్
తెలంగాణ రాష్ట్రంలో మూడవ శాసనసభ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. తాజాగా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు నూతన ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..
తెలంగాణలో ప్రజాతీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉంది. గతంలో తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమకు తరలిరావడం వెనుక కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదు అని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.

సమైక్య రాష్ట్రంలోను, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోని ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగా ఉంటూ పరిశ్రమను పోత్సహించాయి. తాజాగా ఏర్పాటు అవుతున్న నూతన ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు అండగా ఉంటుందనే విశ్వాసం నాకు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తున్నాం అని అల్లు అరవింద్ చెప్పారు.
ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వీలు చూసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను సినీ పరిశ్రమ తరఫున కలుసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకొని పరిశ్రమకు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తాం. పరిశ్రమకు మరింత అండగా ఉండాలని కోరుతాం అని అల్లు అరవింద్ చెప్పారు.

ఇదిలా ఉండగా, తెలుగు సినిమా పరిశ్రమ తరఫున తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నూతనంగా ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ పభుత్వానికి అభినందనలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినందుకు జాతీయ కాంగ్రెస్ నేతలకు, పీసీసీ కమిటి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపేందుకు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, తదితరులు భారీగా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











