బాహుబలికి ధీటుగా రామయణ.. ఇద్దరు డైరెక్టర్లు.. 1500 కోట్లతో అల్లు అరవింద్ క్రేజీగా

Recommended Video

Allu Aravind Announces Prestigious Ramayana Series With 500 Crore Budget || Filmibeat Telugu

చిత్రసీమలో పెద్ద సినిమాలకు పునాది వేసింది బాహుబలి సినిమా. భారీ బడ్జెట్‌తో చాలా ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో భారీ సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ కేటాయించి పౌరాణిక సినిమా 'రామాయణ' రూపొందించేందుకు రెడీ అయ్యారు.

భారీ ప్రాజెక్టు.. ఇద్దరు డైరెక్టర్లు

భారీ ప్రాజెక్టు.. ఇద్దరు డైరెక్టర్లు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇద్దరు డైరెక్టర్లు రామాయణ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 'దంగల్' ఫేం నితేశ్ తివారీ, శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన 'మామ్' డైరెక్టర్ రవి ఉద్యవార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రపంచ ఆడియన్స్ టార్గెట్‌గా భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కనుంది.

1500 కోట్ల బడ్జెట్.. అల్లు అరవింద్ కూడా

భారీ బడ్జెట్ కేటాయించి రామాయణ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ముగ్గురు బడా నిర్మాతలు ఇందులో భాగం కానుండటం విశేషం. 1500 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి అల్లు అరవింద్ సహా నమిత్ మల్హోత్రా, మధు మంతెన ఈ సినిమా నిర్మాణంలో భాగం కానున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు.

 మూడు పార్టులు.. మూడు భాషలు

మూడు పార్టులు.. మూడు భాషలు

రామాయణ చిత్రాన్ని మూడు పార్టులుగా రూపొందించ బోతున్నామని ఈ సందర్బంగా తెలిపారు. ప్రపంచ ఆడియన్స్ టార్గెట్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా అన్ని భాషలకు చెందిన నటీనటులు భాగం కానున్నారు. అతిత్వరలో వారి వివరాలు ప్రకటించనున్నారు. మొదటి భాగం 2021 లో విడుదల కానుంది.

 'బాహుబలి'ని బీట్ చేస్తుందా..?

'బాహుబలి'ని బీట్ చేస్తుందా..?

ఇప్పటివరకు బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను, సృష్టించిన కలెక్షన్ల సునామీని బీట్ చేసే సినిమా రాలేదు. అయితే తాజాగా ప్రకటించబడిన రామాయణ సినిమా ఈ రికార్డులను చెరిపివేయడం ఖాయం అని తెలుస్తోంది. మూడు భాగాలు, ఇద్దరు డైరెక్టర్లు, ముగ్గురు నిర్మాతలు అంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా పౌరాణిక సినిమా కావడంతో ఈ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని జనంలో టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X