ఏం వరం కావాలో కోరుకో.. హీరో కార్తికేయకు అల్లు అరవింద్ బంపర్ ఆఫర్
RX 100 చిత్రంతో టాలీవుడ్‌లోకి మంచి గుర్తింపు పొందిన హీరో కార్తికేయ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. హిప్పి, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90ml చిత్రాల్లో తనదైన శైలిలో రాణించిన కార్తీకేయ ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రూపొందిస్తున్న చావు కబురు చల్లగా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కొంత మేరకు షూటింగ్ పూర్తి చేసుకొన్నది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.
హల్లో కార్తీకేయ, సెప్టెంబర్ 21వ తేదీ నీ పుట్టిన రోజు అనే విషయం తెలిసింది. నీ బర్త్ డే రోజున మీరు ఏది కోరుకొంటే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏం వరం కావాలో కోరుకో నాయన అంటూ గీతా ఆర్ట్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక చావు కబురు చల్లగా సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ ఈ చిత్రంలో బస్తీ బాలరాజుగా కనిపి్తారు. బన్నీవాసుతో పాటు కౌశిక్.పి, సునీల్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగళ్లపాటి ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, మెగా కాంపౌండ్‌తో హీరో కార్తికేయ మంచి సంబంధాలు పెంచుకొన్నారు. జీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి పాటలకు కార్తీకేయ డ్యాన్సులు చేసి మెగాస్టార్ ప్రశంసలు అందుకొన్నారు. అలాగే ఈ మధ్య చిరంజీవితో కలిసి కరోనావైరస్ జాగ్రత్తలను తెలిపే యాడ్‌లో కూడా నటించి మెప్పుపొందారు. ఈ యువ హీరోకు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలుగు ఫిల్మీబీట్ తెలియజేస్తున్నది.


Click it and Unblock the Notifications











