దోశ స్టెప్పులంటూ అల్లు అర్జున్ గాలి తీసేసింది.. అల్లు అర్హ వీడియో వైరల్

Recommended Video

Allu Arjun & Allu Arha Funny Video On Ramulo Ramula Song Dance

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్పుల గురించి తెలుగు రాష్ట్రాలే కాక టోటల్ సౌతిండియా కూడా మాట్లాడుతుంది. అలాంటి బన్నీ స్టెప్పులు దోశ స్టెప్పులు అంటూ గాలి తీసేసింది ఆయన కూతురు. అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రంతో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఒక్కో పాట రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

పాటలతో సెన్సేషన్..

పాటలతో సెన్సేషన్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే అందరికీ ఓ రేంజ్ అంచనాలుండటంలో సహజం. అయితే ఈ చిత్రం నుంచి ఒక్కో పాటను విడుదల చేస్తుండటం.. అవి సంచలనాలు నమోదు చేయడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులోని సామజవరగమన, రాములో రాముల, ఓ మై గాడ్ డాడీ, బుట్ట బొమ్మ పాటలు సోషల్ మీడియాను అల్లాడించాయి.

క్రేజీగా రాములో రాముల

క్రేజీగా రాములో రాముల

ఇవన్నీ ఒకెత్తు అయితే రాములో రాముల పాట మరో ఎత్తు. ఎక్కడ చూసినా, ఏ పార్టీలో చూసినా, ఏ సెలెబ్రేషన్‌లో అయినా రాములో రాముల పాట ఉండాల్సిందే. అందులోనూ అల్లు అర్జున్ వేసిన హాఫ్ కోట్ స్టెప్ సిగ్నేచర్‌గా మారింది. అల్లు అర్జున్ స్టెప్పులంటే అందరూ ఆసక్తిని కనబరుస్తారన్న సంగతి తెలిసిందే.

క్యూట్ వీడియో..

బన్నీ తన కూతురు అల్లు అర్హతో ముద్దుగా ముద్దుగా మాట్లాడిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా అల్లు అర్హతో ఆడుకుంటున్న వీడియోలను షేర్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. తాజాగా తన హాఫ్ కోట్ స్టెప్పుల గురించి కూతురు చేసిన కామెంట్లను సైతం పోస్ట్ చేశాడు.

అవి దోశ స్టెప్పులు..

అవి దోశ స్టెప్పులు..

అల్లు అర్జున్ అల్లు అర్హను ప్రశ్నిస్తూ.. నాన్న సినిమా పేరేంటి? అని అడగ్గా.. అల వైకుంఠపురములో అని ముద్దుగా ముద్దుగా చెప్పింది. అనంతరం.. అందులో ఎల్లో కలర్ జాకెట్ వేసుకుని డ్యాన్సు చేస్తాను కదా అది ఏ పాటా..? అని అడగ్గా.. రాములో రాముల అంటూ మరింత ముద్దుగా చెప్పింది. అది ఏం స్టెప్ అని ప్రశ్నించగా.. దోశ స్టెప్ అని నవ్వేసింది. ఓ సారి దోశ స్టెస్ వెయ్యి అని అడగ్గా.. వేసి చూపించింది. అల్లు అర్హ వేసిన క్యూట్ స్టెప్పులకు బన్నీ పగల బడి నవ్వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X