నిఖిల్ కొత్త మూవీ ప్రారంభం.. ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారో తెలుసా..?
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఓ వైపు సినీ కెరీర్ మంచి ఊపులో ఉండగా.. పర్సనల్ లైఫ్‌లోనూ అనుకున్నది జరగబోతోంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతోన్నాడు. అర్జున్ సురవరం అందించిన బలం నిఖిల్‌కు బాగానే కలిసి వచ్చింది. వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోతోన్నాడు. వెంట వెంటనే సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు. రీసెంట్‌గా కార్తికేయ2ను ప్రారంభించిన నిఖిల్.. నేడు మరో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేశాడు.

కార్తికేయ సీక్వెల్..
నిఖిల్ కెరీర్‌ను నిలబెట్టిన చిత్రాల్లో స్వామి రారా, కార్తికేయ చిత్రాలు కచ్చితంగా ఉంటాయి. అయితే ఈ సినిమాలకు సీక్వెల్స్ తీస్తానని అప్పట్లోనే చెప్పుకొచ్చాడు నిఖిల్. అందులో భాగంగానే.. కార్తికేయ 2 చిత్రానికి ముందడుగు పడింది. ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేశారు.

తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్..
సుకుమార్ రైటింగ్స్‌పై వచ్చిన కుమారి 21ఎఫ్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అదే కాంబో రిపీట్ అవుతుంది. ఆ చిత్రానికి సుకుమార్ కథ అందించగా.. సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. తాజాగా నిఖిల్‌ను హీరోగా ఈ కాంబో రాబోతోంది.

18Pages.. అంటూ
కుమారి 21ఎఫ్ అంటూ ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టిన సుకుమార్ టీమ్.. ఈసారీ అలాంటి ఓ భిన్నమైన పేరును పెట్టేశారు. నేటి పూజా కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ 18Pages అంటూ ప్రకటించారు. అయితే ఈ వేడుక అంతా ఒకెత్తు అయితే బన్నీ గారాల పట్టి అల్లు అర్హ చేసిన అల్లరి, ముద్దు ముద్దు చేష్టలు ఇంకో ఎత్తు.
ముఖ్య అతిథిగా అల్లు అర్హ..
తన కొత్త మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథి ఎవరో తెలుసా? అంటూ నిఖిల్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అల్లు అర్హ తన తాత అల్లు అరవింద్‌తో ముద్దు ముద్దగా ఆడుకుంటోంది. మొత్తానికి అల్లు అర్హ చేష్టలతో నిఖిల్ కొత్త మూవీ ప్రారంభోత్సవానికి ప్రమోషన్స్ బాగానే జరిగింది.


Click it and Unblock the Notifications











