స్టార్ట్ కెమెరా.. రోలింగ్.. యాక్షన్: అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ షూట్ షురూ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ ముచ్చటగా మూడో సినిమా మొదలైంది. అల్లు అర్జున్ కెరీర్లో 19వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పది రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో లాంచ్ అవ్వగా... బుధవారం(ఏప్రిల్ 24) నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల విజయాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ లాంటి బడా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయిన మూవీ ఇది, భారీ స్కేల్‌లో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.

అల్లు అర్జున్ గత చిత్రం 'నా పేరు సూర్య' విడుదలై దాదాపు సంవత్సరం అయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం అందుకోక పోవడంతో కథల ఎంపిక, దర్శకుడి విషయంలో బన్నీ ఆలోచనలో పడ్డాడు. త్రివిక్రమ్ కథతో కన్విన్స్ అవ్వడంతో ఈ మూవీ సెట్స్ మీదకు వచ్చింది.
అల్లు అర్జున్, పూజా హెగ్డేతో పాటు ఇతర ప్రధాన పాత్రలలో టబు, సత్యరాజ్, బోమన్ ఇరానీ, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ,రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రత్యేక పాత్రలో సుశాంత్ నటిస్తున్నాడు. డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటింగ్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











