twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టైలిష్ స్టార్ 'పుష్ప': ఫస్ట్ లుక్కు మాములుగా లేదు.. ఒకేసారి 5 భాషల్లో

    |

    అల..వైకుంఠపురములో.. గ్రాండ్ సక్సెస్ అనంతరం అల్లు అర్జున్ సుకుమార్ తో మరొక డిఫరెంట్ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. నేడు స్టైలిష్ స్టార్ 37వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా బన్నీ అభిమానులకు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ 20వ సినిమాకు అందరు ఊహించినట్లుగానే అదే టైటిల్ నే ఫైనల్ చేశారు.

    Recommended Video

    Pushpa First Look : Allu Arjun Raw Rustic Look Grabs Attention
    స్టైలిష్ స్టార్ పుష్పా..

    స్టైలిష్ స్టార్ పుష్పా..

    స్టైలిష్ స్టార్ అనగానే ఆడియెన్స్ ఎలాంటి అంచనాలను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా మొదలైనప్పటి నుంచి బన్నీ కూడా స్టైలిష్ గా తన సినిమాల లుక్స్ ని వదులుతూ ఉంటాడు. కానీ మొదటిసారి అల్లు అర్జున్ డిఫరెంట్ ఉర మాస్ లుక్కును వదిలాడు. ఇక అందరు ఉహించినట్లుగా సినిమాకు 'పుష్ప' అనే టైటిల్ నే సెట్ చేశారు.

    బన్నీ లుక్కు మాములుగా లేదు..

    బన్నీ లుక్కు మాములుగా లేదు..

    అల్లు అర్జున్ 'పుష్ప రాజ్' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక టైటిల్ ఊహించని స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇలాంటి టైటిల్ బన్నీకి ఎలా సెట్టవుతుంది అనే చర్చ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఫస్ట్ లుక్ లో బన్నీ వింటేజ్ లుక్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మాస్ లుక్కుకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫార్మాట్ లో బన్నీ కనిపించలేదు. దీంతో ఫస్ట్ లుక్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    రంగస్థలం ఫార్మాట్..

    రంగస్థలం ఫార్మాట్..

    చూస్తుంటే సుకుమార్ తన డైరెక్షన్ శైలిని పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది. రంగస్థలం కథను వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంచుకోవడం అలాగే ఇప్పుడు పుష్ప కథను కూడా కొనసాగిస్తున్నట్లుగా అర్ధమవుతోంది. పిరియడిక్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సినిమాలపై ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. ఇక సుకుమార్ రెండవసారి ఏ విధంగా దాన్ని టచ్ చేశాడు అనేది ఆసక్తిగా మారింది.

    బన్నీ పాన్ ఇండియా ప్లాన్..

    బన్నీ పాన్ ఇండియా ప్లాన్..

    బన్నీ కూడా తన మొదటి పాన్ ఇండియా కాన్సెప్ట్ తో నేషనల్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. ఒకేసారి సినిమాను 5 భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్స్ తో క్లారిటీ ఇచ్చేశారు. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమా రిలీజ్ కాబోతోంది. హిందీలో డబ్ అయిన బన్నీ సినిమాలకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఇక మలయాళంలో మల్లు స్టార్ అనే బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. కన్నడలో , తమిళ్ కూడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి బన్నీ చేస్తున్న ప్రయత్నం మంచిదే.

    బన్నీ పాత్రపై రూమర్స్..

    బన్నీ పాత్రపై రూమర్స్..

    అల్లు అర్జున్ పాత్రతో ఇప్పటికే ఆడియెన్స్ లో ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. గత కొన్ని రోజులుగా సినిమా టైటిల్ పుష్పా అంటూ రూమర్స్ వచ్చాయి. అదే నిజమైంది. అదే విధంగా బన్నీ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తాడని లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నట్లు కూడా టాక్ వచ్చింది. దాదాపు ఆ అనుమానాలు కూడా నిజమవుతున్నట్లు అర్థమవుతోంది. చూస్తుంటే బన్నీ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చూపించేలా కనిపిస్తున్నాడు.

    English summary
    Stylish Star Allu Arjun’s highly-anticipated hat-trick film with Sukumar have just released a terrific first look poster to announce that the film has been titled Pushpa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X