AA23 అఫీషియల్: హై వోల్టేజ్ దర్శకుడితో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిక్స్.. సినిమా వచ్చేది అప్పుడే..
ఐకాన్ స్టార్ గా పుష్ప సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సెకండ్ పార్ట్ తో మరింత పవర్ఫుల్ గా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో అల్లు అర్జున్ హఠాత్తుగా తన 23వ సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తో సినిమా చేయబోతున్న పాన్ ఇండియా దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అలాగే ఎప్పుడు విడుదలవుతుంది? నిర్మాత ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

అంతకుమించి అనేలా
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఫ్యాన్ ఇండియా సినిమాలను వరుసగా లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో ఘనవిజయాన్ని అందుకోవడంతో సెకండ్ పార్ట్ కూడా 1000 కోట్ల మార్కెట్ అందుకుంటుంది అని టాలీవుడ్ లో అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇక అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టులో కూడా అంతకుమించి అనేలా ఉండాలి అని చూసుకుంటున్నాడు.

చాలా కాలంగా ఆఫర్స్
పుష్ప సెకండ్ పార్ట్ ను ఈ ఏడాది చివరలో వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఎడాది మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. అయితే ముందుగానే అల్లు అర్జున్ తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. ఇక చాలాకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న దర్శకుల చేత అల్లు అర్జున్ కథలు వింటూనే ఉన్నాడు.

బాలీవుడ్ ప్రొడక్షన్
ఇక గత రెండు మూడు రోజులుగా అల్లు అర్జున్ తన 23వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా సోషల్ మీడియాలో అనేకరకాల వార్తలు వచ్చాయి. అయితే మొత్తానికి ఆ విషయంలో ఈరోజు క్లారిటీ ఇచ్చేశారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ టి సిరీస్ లో భూషణ్ కుమార్ నిర్మాతగా అల్లు అర్జున్ 23వ సినిమా తెరపైకి రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఫిక్స్
ఇక ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాతో అటు బాలీవుడ్ లోనూ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సందీప్ ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

అప్పుడే రావచ్చు?
అయితే ప్రభాస్ స్పిరిట్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే సందీప్ రెడ్డి వల్ల అల్లు అర్జున్ 23వ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించడం విశేషం. ఈ సినిమాను 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రభాస్ ఒకవేళ బిజీగా ఉంటే అంతకంటే ముందే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చు అని కూడా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











