Allu Arjun: అల్లు అర్జున్ ను కలవాలంటే.. 42 నిబంధనలు పాటించాలా?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే స్టైల్‌కే మరో పేరు. 'స్టైలిష్ స్టార్'గా మొదలైన ఆయన జర్నీ ఇప్పుడు 'ఐకాన్ స్టార్' స్థాయికి చేరినా, ఆఫ్-స్క్రీన్ స్టైలింగ్ విషయంలో బన్నీ ఇప్పటికీ నెక్ట్స్ లెవల్. తెరపై ఎంత క్లాస్‌గా కనిపిస్తాడో, బయట కూడా అంతే ట్రెండీగా ఉండటం ఆయన ప్రత్యేకత. ఇక పుష్ప 2 ఘన విజయాలతో ఆయన క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. అయితే తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది... సినిమా హిట్‌తో కాదు, ఆయనను కలవడానికి "42 చేయాల్సినవి-చేయకూడనివి" ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నిబంధనలేంటీ? అందులో నిజానిజాలేంటీ?
ఈ వివాదానికి మూలం వుమెన్ ఇన్ మీడియా సెల్స్ (Women in Media Sales)అనే పాడ్‌కాస్ట్. ఇందులో మీడియా సేల్స్ లీడర్, బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు తమకు 42 నియమాలతో కూడిన నోట్ ఇచ్చారని చెప్పారు. అందులో 'సర్ కళ్లలోకి నేరుగా చూడకూడదు', 'కరచాలనం చేయకూడదు', 'ఫోన్లు అనుమతించరు'వంటి నిబంధనలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు మొదలయ్యాయి. కావేరీ బారువా మాట్లాడుతూ .. దక్షిణాది స్టార్లు సాధారణంగా పెద్ద క్యాంప్‌తో వస్తారని, అల్లు అర్జున్ విషయంలో అయితే "మేనేజర్‌కు మేనేజర్‌కు మేనేజర్" వరకూ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూయర్ "ఎందుకు కళ్లలోకి చూడకూడదు?" అని అడిగితే.. 'దట్స్ ది రూల్' అంటూ సమాధానం ఇచ్చింది.
ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 'ఇంటర్వ్యూల్లో జర్నలిస్టులు సాధారణంగానే కళ్లలోకి చూసి మాట్లాడతారు. ఇది పూర్తిగా అబద్ధం'అని కొందరు వాదిస్తుండగా, మరికొందరు 'స్టార్ చుట్టూ భారీ భద్రత ఉంటుంది, ప్రైవసీ, సెక్యూరిటీ కోసమే ఇలాంటి ప్రోటోకాల్‌లు'అంటూ సమర్థిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు మాత్రం 'కళ్లలోకి చూడకూడదా? ఎందుకు?' అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ప్రోటోకాల్‌పై మళ్లీ చర్చను రేకెత్తించింది.
ముఖ్యంగా "నో హ్యాండ్‌షేక్, నో ఐ కాంటాక్ట్" వంటి రూల్స్ ఉన్నాయంటూ వచ్చిన పోస్టులు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే ఈ కథనాలపై పరిశీలిస్తే, ఇవన్నీ ఆధారరహిత సోషల్ మీడియా అపోహలేనని స్పష్టమవుతోంది. ఇటీవల హీరో నటించిన Pushpa 2: The Rule ప్రమోషన్ల సందర్భంగా జపాన్ టోక్యోలో జరిగిన ఈవెంట్స్‌లో అల్లు అర్జున్ అభిమానులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన వీడియోలు వైరల్ అయ్యాయి.
అక్కడ ఆయన చిరునవ్వుతో ఫ్యాన్స్‌ను పలకరిస్తూ, ఫొటోలు దిగుతూ కనిపించారు. మరో వీడియోలో ఓ అభిమాని కన్నీళ్లు పెట్టుకోవడంతో, అల్లు అర్జున్ స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లి చేతులు కలిపి ధైర్యం చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ విషయంలో అల్లు అర్జున్ తరఫున ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ చివరిగా పెద్ద హిట్ అయిన పుష్ప: ది రూల్ (2024), ఇది పుష్ప: ది రైజ్ (2021) కి సీక్వెల్. అతను ప్రస్తుతం అట్లీ దర్శకత్వం వహించే AA22xA6 అనే తాత్కాలిక టైటిల్ తో బిజీగా ఉన్నాడు . ఇందులో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రమ్య కృష్ణన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అంతేకాకుండా, మైత్రి మూవీ మేకర్స్ అల్లు అర్జున్, కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్ లతో వారి తదుపరి పెద్ద ప్రాజెక్ట్ AA23 ను కూడా ప్రకటించింది. ఇది అల్లు అర్జున్ 23వ సినిమా. అతని బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ పుష్ప తర్వాత మైత్రితో అల్లు అర్జున్ పని చేయడం రెండో సారి. ఈ సారి రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











