twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. నిర్మాణ సంస్థ రియాక్షన్.. చేసింది ఎవరంటే?

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ వచ్చేసిందంటూ..గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలిసినా.. అఫీషియల్ లుక్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉండగా.. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్మరింత సెన్సేషన్‌గా మారింది. తాజాగా ఆ పోస్టర్‌పై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ స్పందించింది.

     ఇండస్ట్రీ హిట్ ఊపుతో..

    ఇండస్ట్రీ హిట్ ఊపుతో..

    అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమా మార్క్ టేకింగ్, అల్లు అర్జున్ స్టైలీష్ పర్ఫామెన్స్, తమన్ సంగీతం ఇలా ప్రతీ ఒక్కటి కలిసి అల వైకుంఠపురుములో సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి. అదే ఊపులో ఉన్న బన్నీ.. సుకుమార్ చిత్రంతో బిజీ కానున్నాడు.

    హ్యాట్రిక్ దిశగా..

    హ్యాట్రిక్ దిశగా..

    రంగస్థలం సినిమా తరువాత మరో చిత్రాన్ని పట్టాలెక్కించని సుకుమార్.. బన్నీకి అదిరిపోయే కథను సిద్దం చేశాడు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఈ సారి మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. కరోనా వల్ల కాస్త ఆలస్యం కానుంది.

    ఫ్యాన్ మేడ్ పోస్టర్..

    సుకుమార్ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో బన్నీ.. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటించబోతోన్నట్టు టాక్. ఈ మేరకు బన్నీ మేకోవర్ కూడా పూర్తిగా మారబోతోంది. అందుకే బన్నీ జుట్టు, గడ్డం పెంచేస్తున్నాడు. తాజాగా బన్నీ పోస్టర్ ఒకటి తెగ వైరల్ అయింది. అచ్చం అఫీషియల్ లుక్‌లా అనిపించిన ఆ పోస్టర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. రగ్డ్, రా లుక్‌లో ఉన్న బన్నీని చూసి అంతా ఫిదా అయ్యారు.

    Recommended Video

    Trisha Revealed Allu Arjun's Secret Social Media Account
    స్పందించిన నిర్మాణ సంస్థ..

    స్పందించిన నిర్మాణ సంస్థ..

    అది ఫ్యాన్ మేడ్ పోస్టర్.. మేము అధికారికంగా ప్రకటించే వరకు అలాంటి ఇంకా ఎన్నింటినో రానివ్వండి అంటూ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ క్రియేటర్.. ఆ పోస్టర్ తానే తయారు చేశానని, గ్రాఫిక్ డిజైనర్ విద్యార్థిని, కేరళ అభిమానినని చెప్పుకొచ్చాడు. నువ్వొ గొప్ప విద్యార్థివని మైత్రి అతగాడిని ప్రశంసలతో ముంచెత్తింది.

    English summary
    Allu Arjun AA 20 New Poster Designed By Kerala fan. Who Is An hard Cor Fan From kerala Revealed That He Made That Poster. ThisMovie Is directed by Sukumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X