తండ్రిగా మంచి నిర్ణయమే తీసుకున్నా.. అయాన్ పట్ల పట్టలేని ఆనందం.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీతో సరదాగా గడిపేస్తుంటాడు. అల్లు అయాన్, అల్లు అర్హ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఇద్దరు చేసే అల్లరిని అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. బన్నీ కూడా వీరిద్దరితో చేసే చిలిపి పనులను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా అయాన్‌కు సంబంధించిన విషయాలను బన్నీ షేర్ చేశాడు. అదేంటో ఓ సారి చూద్దాం.

అల్లువారి పిల్లలు..
అల్లువారి పిల్లలకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. అల్లు అర్హ వీడియోలకు, క్యూట్ క్యూట్ మాటలకు ఎంతో మంది అభిమానులున్నారు. అల్లు పిల్లలు బయట కనిపిస్తే చాలు కెమెరా కళ్లన్ని అటు వైపే చూస్తాయి. వారిద్దరి ఆటలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

ఓ మై గాడ్ డ్యాడీ..
ఓ మై గాడ్ డ్యాడీ ప్రమోషనల్ సాంగ్‌లో అల్లువారి పిల్లలిద్దరూ ఎంత అల్లరి చేశారో అందరికీ తెలిసిందే. ఆ లిరికల్ వీడియోలో అయాన్, అర్హలు దుమ్ములేపారు. వారిద్దరిని నటింపజేసేందుకు త్రివిక్రమ్ ఎంత కష్టపడ్డాడో సరదాగా చెప్పుకొచ్చాడు.
అయాన్ ప్రీ స్కూల్..
తాజాగా అయాన్ ప్రీ స్కూల్ గురించి ఓ ట్వీట్ చేశాడు. అయాన్ ప్రీ స్కూల్ పూర్తయిందని, సహకరించిన టీచర్స్, స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెబుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. అయాన్ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఎమోషనల్ అయ్యాడు.
Recommended Video

తల్లిదండ్రులుగా సరైన నిర్ణయం..
ప్రీ స్కూల్ గ్రాడ్యూయేషన్ సెలెబ్రేషన్స్. అయాన్ పట్ల ఎంతో ఆనందంగా ఉన్నాను.. నా కుమారుడి భవిష్యత్తుకు పునాది వేసిన బోదీ వ్యాలీ స్కూల్ టీచర్స్, యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ స్కూల్‌లో వేయాలనే మంచి నిర్ణయాన్ని మేము తీసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాము.


Click it and Unblock the Notifications











