సోదరుడి కోసం బన్నీ.. ‘గని’పై అల్లు అర్జున్ పోస్ట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాడు. వరుణ్ తేజ్ బర్త్ డే (జనవరి 19) సందర్భంగా తనకొత్త సినిమా ప్రాజెక్ట్ అప్డేట్‌ను ప్రకటించారు. ఇన్ని రోజులు VT10 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలిచారు. అలా ఇన్ని రోజుల తరువాత వరుణ్ తేజ్ పదో సినిమాకు సంబంధించిన పస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
వరుణ్ తేజ్ పదో చిత్రానికి గని అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇలా గని అనే టైటిల్‌ను వింటే అందరికీ రెండు సినిమాలు గుర్తుకు వస్తాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బాలు సినిమా. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు గని. ఇక రెండోది వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దల కొండ గణేష్. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ పేరు గని. ఇలా మొత్తంగా తన పదో సినిమాకు గని అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

గని చిత్రాన్ని అల్లు బాబీ, సిద్దు ముద్ద కలిసి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తన సోదురుడు అల్లు బాబీకి సపోర్ట్‌గా అల్లు అర్జున్ ఓ ట్వీట్ వేశాడు. నిర్మాతగా మొదటి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని బన్నీ కోరాడు. ఇక వరుణ్ తేజ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ.. గని పంచ్ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు. నిర్మాతలు అడుగుపెడుతున్న అల్లు బాబీ, సిద్దు ముద్దకు స్వాగతం పలికాడు. మొత్తానికి ఇది అల్లు మెగా మూవీ అయినట్టే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలుకానున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











