మరోసారి బయటపడ్డ మెగా - అల్లు విభేదాలు .. చిరంజీవిని కలిసిన పుష్ప 2 టీమ్ , అల్లు అర్జున్ డుమ్మా
మెగాస్టార్ చిరంజీవి వేసిన పునాదులపై ఏర్పడిన మెగా ఫ్యామిలీలో ఆయన తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి దుర్గా తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, నిహారిక వంటి వారు ఎంట్రీ ఇచ్చారు. హీరోలే కాదు.. గీతా ఆర్ట్స్, కొణిదెల ప్రొడక్షన్స్, అంజనా ప్రొడక్షన్స్, గీతా 2, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ పాటు ఓటీటీ సంస్థ ఆహాలు మెగా కుటుంబానికి చెందినవే. అలా మెగా ఫ్యామిలీ టాలీవుడ్‌పై వేసిన ముద్ర సామాన్యమైనది కాదు.
తొలి నుంచి మెగా హీరోలది , కుటుంబానికి ఒకే మాట. కుటుంబంలో కానీ, సినిమా విషయాలలో కానీ మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి వచ్చి నిలిచేది . అయితే ఈ కుటుంబం పైకి కనిపిస్తున్నట్లుగా లేదని లోపల ఒకరికొకరు పడటం లేదంటూ ఫిలింనగర్‌లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది. దీనంతటికీ కారణం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరని , తనకు మెగా బ్రాండ్ వద్దన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంటోందని పుకార్లు వైరల్ అవుతున్నాయి.

చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్‌తో పాటు నిన్న మొన్నటి నంద్యాలలో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం వరకు బన్నీ చేసిన చర్యలు మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించాయని అంటారు. ఇప్పటి వరకు చూసీ చూడనట్లుగా వదిలేసినప్పటికీ.. ఏపీ ఎన్నికల తర్వాత మెగా పెద్దలు బన్నీపై సీరియస్ అయినట్లుగా ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్‌పై నాగబాబు ట్వీట్, బన్నీ దంపతులను సాయిథరమ్ తేజ్ సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం .. ఈ పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని అంటున్నారు.
అల్లు అర్జున్ కూడా కొన్ని సందర్భాలలో మెగా ఫ్యామిలీపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారంటూ మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మొన్నామధ్య ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బన్నీ.. తన మనసుకు నచ్చితే ఎక్కడికైనా, ఎవరి కోసమైనా వచ్చేస్తానని చెప్పారు. అలాగే ఫ్యాన్స్‌ని చూసి తాను హీరో అయ్యానని.. తన వెనుక అల్లు ఆర్మీ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు.
ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఇందులో బన్నీ చెప్పిన డైలాగ్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎవడ్రా బాస్ ? ఎవడికి రా బాస్? ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్? అంటూ అల్లు అర్జున్ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతాడు. ఇది పరోక్షంగా మెగా ఫ్యామిలీ గురించేనా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్ యూనిట్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. సుకుమార్, మైత్రీ అధినేతలు నవీన్, రవి తదితరులు చిరంజీవిని కలిసి సినిమా విశేషాలు ఆయనతో పంచుకున్నారు. అయితే చిరుని కలిసిన బృందంలో హీరో అల్లు అర్జున్ లేకపోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. బన్నీ ఎక్కడంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగారు.


Click it and Unblock the Notifications











