AA22: పుష్ప 2 తరువాత ప్లాన్ మారుస్తున్న అల్లు అర్జున్.. హిట్ కాంబినేషన్లో మరో బిగ్ మూవీ
బడా ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీనికితోడు ఈ మధ్య కాలంలోనే 'పుష్ప ది రైజ్' చిత్రంతో అతడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ జోష్‌లోనే ఈ స్టార్ హీరో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు మరో కొత్త ప్రాజెక్టును కూడా ఓకే చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
పుష్ప మళ్లీ వస్తున్నాడు: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా మారింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు అతడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప ది రూల్' మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూట్ శరవేగంగా సాగుతోంది.

23వ ప్రాజెక్టు అతడితో: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 23వ ప్రాజెక్టును 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాను 2024లో మొదలు పెట్టి.. 2025 చివర్లో విడుదల చేసేలా ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించబోతోంది.
గురూజీతో మరో మూవీ: వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో దర్శకుడితో ప్రాజెక్టును చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఆయన మరెవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును.. వీళ్లిద్దరి కాంబోలో మరో మూవీ రాబోతుందట. ఇది 'పుష్ప ది రూల్' పూర్తైన వెంటనే మొదలు కాబోతుందని కూడా ఓ న్యూస్ లీకైంది.

భారీ బడ్జెట్.. వాళ్లతోనే: 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల.. వైకుంఠపురములో' వంటి హిట్ల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బన్నీ వాసు, సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారని కూడా తెలిసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారని సమాచారం.
హై రేంజ్ యాక్షన్‌తో : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే సినిమాను హై రేంజ్ యాక్షన్‌తో తీసుకు రాబోతున్నారట. ఇప్పటి వరకూ ఈ హీరో కానీ, డైరెక్టర్ కానీ చేయని పవర్‌ఫుల్ యాక్షన్ ఇందులో ప్లాన్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఇది యూనివర్శల్ స్టోరీతో వచ్చే సినిమా కావడంతో దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారని టాక్.


Click it and Unblock the Notifications











