అలవైకుంఠపురములో టీజర్ గ్లింప్స్.. కేక పుట్టిస్తోన్న బన్నీ
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న అల వైకుంఠపురములో సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటాయి. సామజవరగమన, రాములో రాముల, ఓఎమ్‌జీ డాడీ అంటూ ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ.. హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన చిత్రయూనిట్ మరోసారి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమైంది.

మెగా అభిమాని మృతితో..
గ్రేటర్ హైద్రాబాద్ చిరంజీవి యువత లీడర్, మెగా ఫ్యాన్ అయిన నూర్ మహ్మద్ ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో మెగా అభిమానులు ఆయనకు సంతాపం తెలిపారు. తోటి ఫ్యాన్స్ కాక.. మెగా హీరోలు సైతం నూర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు. నూర్‌కు మెగా హీరోలందరితోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా అందరితోనూ కలిసిన సంగతి తెలిసిందే. నూర్ మరణంతో కుంగిపోయిన మెగాహీరోలు సోషల్ మీడియాలో వేదికగా స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

కుటుంబాన్ని పరామర్శించిన చిరు, బన్నీ
నూర్ మరణంతో బాధపడుతున్న ఆయన కుటుంబాన్ని చిరంజీవి, అల్లు అర్జున్ పరామర్శించారు. ఆర్థికంగా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంతటి అభిమాని మరణంతో అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఎలాంటి హడావిడి చేయకూడదని నిర్థయించుకున్నారు.
వాయిదా వేసిన గీతా ఆర్ట్స్..
‘నూర్ లాంటి అభిమాని మరణంతో.. కుటుంబంలోని ఓ వ్యక్తిని కోల్పోయినట్లు అనిపిస్తోంది. నూర్ భాయ్ లాంటి వారు మా కుటుంబంలోని ఓ వ్యక్తి. ఇలాంటి సమయంలో ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వదలుచుకోలేదు' త్వరలోనే టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ రేపు ఉదయం పది గంటలకు ప్రకటిస్తామని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. అయితే ఈ టీజర్‌కు సంబంధించిన ఓ చిన్న శాంపిల్‌ను రిలీజ్ చేశారు.
Recommended Video

అదిరిపోయిన ప్రీ టీజర్..
టీజర్‌పై హైప్ క్రియేట్ చేసేలా కట్ చేసిన ఈ గ్లింప్స్ బన్నీ లుక్‌ను రివీల్ చేయలేదు. అయితే అంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్స్‌తో బన్నీ లుక్ ఎలా ఉండబోతోందన్నది తెలిసిందే. ఆఫీస్ మీటింగ్‌లో టేబుల్ మీద నడుచుకుంటూ వెళ్తోన్న బన్నీని చూసి అందరూ షాక్ అవుతున్నారు. మరి దాని వెనుకున్న కథెంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.


Click it and Unblock the Notifications











