మీరిప్పుడే కారు దిగారు, నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా: అల వైకుంఠపురములో టీజర్ కేక
అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంతకుముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. మరోసారి హిట్ కొట్టేసి త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్ పూర్తి చేయాలని స్టైలీష్ స్టార్ ఫిక్స్ అయ్యాడు. అల వైకుంఠపురములో అంటూ రాబోతోన్న ఈ క్రేజీ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ అంచనాలను మరింత పెంచేందుకు టీజర్‌ను విడుదల చేశారు.

మెగా అభిమాని మృతితో వాయిదా..
మెగా అభిమాని నూర్ మహ్మద్ మృతితో సోమవారమే రావాల్సిన ఈ టీజర్.. బుధవారం వచ్చింది. నూర్ లాంటి అభిమాని మరణంతో తామెంతో కోల్పోయామని తెలిపిన గీతా ఆర్ట్స్.. అలవైకుంఠపురములో నుంచి ఎలాంటి అప్‌డేట్స్, సంబరాలు లాంటివి జరుపకూడదని టీజర్‌ను వాయిదా వేసేంది.
హైప్ పెంచేందుకు కొత్త ఎత్తులు..
టీజర్ వాయిదా పడటంతో నిరాశ చెందిన అభిమానులకు కాసింత ఊపిచ్చేందుకు టీజర్ గ్లింప్స్ అంటూ స్టైలీష్ స్టార్ లుక్‌ను రివీల్ చేశారు.టీజర్ ఎలా ఉండబోతోందని, చిన్న గ్లింప్స్ ద్వారా తెలియజెప్పేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉండబోతోందన్నది ఓ సారి చూద్దాం.

మీరిప్పుడే కారు దిగారు..నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా..
మీ నాన్న పెళ్లికూతురిని దాచినట్టు దాచారు నిన్ను, గట్టోడివి.. ‘స్టైల్‌గా ఉంది కదా.. నాకు కూడా నచ్చింది'.. ‘మేడమ్ సర్.. మేడమ్ అంతే'.. ‘అది వైకుంఠపురమురా'.. ‘సమ్ థింగ్ కంప్లీట్ అవ్వడం లేదా.. డైలాగ్ లేదనా'.. ‘మీరిప్పుడే కారు దిగారు..నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా..' లాంటి డైలాగ్‌లతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. బన్నీ క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా ఉండబోతోన్నట్లు అర్థమవుతోంది.

పాటలు ఫుల్ ఫేమస్..
అల వైకుంఠపురములో నుంచి వచ్చిన ప్రతీ పాట ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. సోషల్ మీడియాలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. సామజవరగమన అంటూ వంద మిలియన్లను సొంతం చేసుకున్న మొట్టమొదటి తెలుగు పాటగా రికార్డులు నమోదు చేసింది. రాములో రాముల, ఓఎమ్‌జీ డాడీ అనే సాంగ్స్ సైతం యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఇవే ఈ రేంజ్‌లో హల్ చల్ చేస్తుంటే.. మూవీ విడుదలైతే పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాలి. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











