అల వైకుంఠపురములో ఖాతాలో మరో రికార్డ్.. నేషనల్ వైడ్ ట్రెండింగ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎన్ని రికార్డుల క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల వైకుంఠపురములో రికార్డుల్లో చాలా రకాలున్నాయి. బాక్సాఫీస్ రికార్డులు.. సోషల్ మీడియా రికార్డులంటూ సపరేట్‌గా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కాకుండా టాలీవుడ్ హయ్యస్ట్ గ్రాస్, షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలించింది.
అవి అల వైకుంఠపురములో బాక్సాఫీస్ లెక్కలు. ఇక సోషల్ మీడియాలో అల వైకుంఠపురములో క్రియేట్ చేసిన రికార్డులు, వాటి లెక్కలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా థమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం, పూజా అందాలు, త్రివిక్రమ్ టేకింగ్ ఇలా అన్నంటికి భారీగానే క్లిక్ అయ్యాయి. ఒక్కో పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యింది. కొన్ని మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధించాయి.

తాజాగా అల వైకుంఠపురములో మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐఎండీబీలో మోస్ట్ వ్యూయ్డ్ ట్రైలర్‌గా రికార్డులకెక్కింది. ఈ ఏడాది ఎక్కవ మంది వీక్షించిన టాప్-20 ట్రైలర్ల జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. అయితే దక్షిణాది నుంచి కేవలం బన్నీ చిత్రం మాత్రమే నిలవడం విశేషం. ఇక నేటి ఉదయం నుంచి అల వైకుంఠపురములో సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతూనే వచ్చింది. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా రికార్డులు మాత్రం ఆగడం లేదు.


Click it and Unblock the Notifications











