అల వైకుంఠపురములో ట్రైలర్ : పులి వచ్చింది.. మేక చచ్చింది..
నా పేరు సూర్య తరువాత గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సినిమాతో దాన్ని పూడ్చేందుకు సిద్దమయ్యాడు. గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అంటూ క్లారిటీ ఇస్తూ వదిలిన 'అల' గ్లింప్సెస్ నుంచి రీసెంట్‌గా వదిలిన టైటిల్ ట్రాక్ వరకు అల వైకుంఠపురములో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే పోతోంది. మ్యూజికల్ సెన్సేషనల్‌గా మారిన అల వైకుంఠపురములో ఆల్బమ్ బన్నీ ఫ్యాన్స్‌నే కాక సినీ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమైంది. విడుదలకు దగ్గర పడుతుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో నేటి సాయంత్రం అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేసింది యూనిట్. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
ఎప్పుడెప్పుడా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఇప్పటి వరకు టీజర్, గ్లింప్స్, పాటలతోనే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసింది అల టీమ్. నిమిషం వ్యవధి ఉన్న టీజరే అంతగా అంచనాలు పెంచేస్తే.. ఇక ట్రైలర్ ఇంకే రేంజ్‌లో ఉంటుందా? అని బన్నీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. నేటి మ్యూజికల్ కాన్సర్ట్‌లో ఆ సమయం వచ్చేసింది. ఎట్టకేలకు అల వైకుంఠపురములో ట్రైలర్ వచ్చేసింది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.

'నిజమే చెబుతావా? నిజమైతేనే వాడు చెబుతాడు'.. 'దేన్నైనా పుట్టించే శక్తి రెండింటికే ఉంది.. ఒకటి నేలకు, రెండు వాళ్లకు'.. 'గొప్ప యుద్దాలన్నీ నా అనుకున్నవాళ్ల కోసమే..' 'అదే టైమ్‌లో పులి వచ్చింది..మేక చచ్చింది.. 'అనే డైలాగ్‌లు అదిరిపోయాయి. నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్‌కు పండగే అన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











