twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యూట్‌గా డైలాగ్‌తో అదరగొట్టిన అల్లు అర్హ.. ఆనందంతో పొంగిన అల్లు అర్జున్

    |

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. వారి డ్రెస్సింగ్, క్యూట్ లుక్స్‌తో అల్లు అయాన్, అల్లు అర్హ లకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికలపై ఎన్నోసార్లు తమ బుల్లి బుల్లి మాటలు, చిలిపి చేష్టలతో ఆకట్టుకొన్నారు. తాజాగా డాటర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. తండ్రి, కూతుళ్ల హంగామా మీరే చూడండి.. వివరాల్లోకి వెళితే..

    కూతురుకి చిన్నప్పటి నుంచే డైలాగ్స్ నేర్పిస్తున్నాడు..

    కూతురుకి చిన్నప్పటి నుంచే డైలాగ్స్ నేర్పిస్తున్నాడు..

    అల్లు అర్హ చెప్పే డైలాగ్స్ , పలికే మాటలు ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ తండ్రీ కూతుళ్ళ సంభాషణ ఎక్కడ చూసినా మార్మోగింది. పెళ్లి గురించి అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడం.. అంతా కరెక్టుగా చెప్పుకుంటూ రావడం.. చివర్లో డాడీ కి పంచ్ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది.

    అల.. వైకుంఠపురం డైలాగ్‌తో

    అల.. వైకుంఠపురం డైలాగ్‌తో

    తాజాగా తన సినిమాలో డైలాగ్తో రచ్చ చేస్తున్నాడు..ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావ్.. అని అల్లు అర్జున్ను ఉద్దేశించి అంటే.. ఇవ్వలే.. వచ్చింది అంటూ తన స్టయిల్లో చెప్పిన అల వైకుంఠపురంలో టీజర్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్ను తన కూతురితో క్యూట్ గా చెప్పించాడు.

    డాటర్స్ డే సంధర్భంగా...

    డాటర్స్ డ్ సందర్భంగా.. తన కూతురితో కలిసి చేసిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో లో.. ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అంటూ అల్లు అర్జున్ సీరియస్ గా అంటూంటే.. ఇవ్వలే వచ్చింది.. అంటూ క్యూట్ గా చెప్పేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో అల వైకుంఠపురంలో సినిమాను చేస్తున్నాడు. తరువాత వేణు శ్రీ రామ్ తో ఐకాన్, సుకుమార్ తో మరో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

    త్రివిక్రమ్‌తో కలిసి..

    త్రివిక్రమ్‌తో కలిసి..

    ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి అల.. వైకుంఠపురంలో అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. సంక్రాంతి బరిలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్ లుక్ అభిమానుల్లో జోష్ పెంచాయి.

    English summary
    Allu arjun' Allu Arha dialogue video goes viral in the social media. She delivered a dialogue from Ala Vaikuntapuram lo. That Video goes viral in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X