ఒకే వేదికపై చిరంజీవి, అల్లు అర్జున్.. బాలయ్య కోసం పవన్ కల్యాణ్ వస్తున్నాడా?

నందమూరి బాలకృష్ణ సినీనటుడిగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మెగా ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇండస్ట్రీల నుంచి అతిరథ మహారథులు తరలిరానున్నారు. బాలయ్య బావగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. అన్నింటిలోకి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎవరెవరు రాబోతున్నారోనంటూ జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఫలానా వాళ్లు వస్తున్నారు, లిస్ట్ ఇదేనంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇదే ఫైనల్ అని ఎవరూ కన్ఫర్మ్ చేయడం లేదు. అయితే చిరంజీవి
నాగార్జున‌, వెంక‌టేష్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గోపీచంద్‌, అఖిల్‌, గోపీచంద్‌ , సాయిధ‌ర‌మ్ తేజ్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, విశ్వ‌క్‌సేన్‌, శ్రీ‌విష్ణు, నాగశౌర్య‌, అల్ల‌రి న‌రేష్‌ రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేనని వార్తలు వస్తున్నాయి.

Allu Arjun and Chiranjeevi to Share Stage at Nandamuri Balakrishna s 50-year celebrations event

బాలకృష్ణ ఈవెంట్ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. అందులోనూ అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్‌‌లపైనే అందరి చూపూ ఉంది. బాలయ్య - నాగ్‌లు ఒకే వేదికపై కనిపించి చాలా రోజులే అవుతోంది. వీరిద్దరిని మళ్లీ పక్కపక్కనే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య 50 ఇయర్స్ ఈవెంట్‌కు రావాల్సిందిగా నాగార్జునకు ఇన్విటేషన్ అందింది. ఆదివారం బిగ్‌బాస్ లాంచింగ్ ఉన్నప్పటికీ, వీలు చూసుకుని ఆయన అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ - మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చెప్పను బ్రదర్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి మద్ధతు, ఓ మూవీ ఈవెంట్‌లో వ్యాఖ్యల కారణంగా అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా కాంపౌండ్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన పలు కార్యక్రమంలో బన్నీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన బాలయ్య ఈవెంట్‌కు వస్తారని టాక్.

అల్లు కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి ఉన్న అనుబంధంతో పాటు అన్‌స్టాపబుల్‌ కార్యక్రమంతో బాలయ్యతో బన్నీకి రిలేషన్ పెరిగింది. ఈ బాండింగ్‌తోనే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్ వచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ 50 ఇయర్స్ ఈవెంట్‌కు కూడా ఆయన రానున్నారని టాక్. చిరంజీవి కూడా అటెండ్ కానుండటంతో ఇద్దరూ ఒకే వేదికను పంచుకోనున్నారు. అదే జరిగితే మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనన్న సంకేతాలు ఇచ్చినట్లే.

అందరూ ఓకే గానీ పవర్‌స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న సమాచారాన్ని బట్టి పవన్ ఈ కార్యక్రమానికి రావడం లేదట. ముందుగా షెడ్యూల్ చేసిన కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉండటంతో ఆయన రావడం వీలుపడలేదట. అయితే సెప్టెంబర్ 15న విజయవాడలో జరిగే బాలయ్య 50 ఇయర్స్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ వస్తారని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X