అల్లు అర్జున్ ‘ఐకాన్.. కనబడుట లేదు’: దిల్ రాజు ప్రకటన!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఇప్పటికే ఆయన త్రివిక్రమ్, సుకుమార్ ప్రాజెక్టులకు సైన్ చేయడం, వాటి గురించి అఫీషియల్ స్టేట్మెంట్స్ రావడం తెలిసిందే.
తాజాగా అల్లు అర్జున్ మరో కొత్త సినిమాకు సైన్ చేశారు. 'ఎంసీఏ' ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు నిర్మించబోతున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్న ఈ చిత్ర టైటిల్ ఆసక్తిరేకెత్తిస్తోంది.

ఐకాన్.. కనబడుట లేదు
అల్లు అర్జున్‌తో చేయబోయే చిత్రానికి ‘ఐకాన్' అనే టైటిల్ ఫైనల్ చేశారు. ‘కనబడుట లేదు' అనేది సబ్ టైటిల్. ఈ మేరకు చిత్ర బృందం అపీషియల్ పోస్టర్ విడుదల చేసింది. అల్లు అర్జున్‌తో కలిసి 4వ ప్రాజెక్ట్ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.

దిల్ రాజు ఫుల్ హ్యాపీ
‘డిజె-దువ్వాడ జగన్నాధం' తర్వాత బన్నీతో మరో సినిమా చేయడానికి దిల్ రాజు ట్రై చేస్తున్నారు. అయితే సరైన స్క్రిప్టు కుదరక పోవడంతో తన ప్రయత్నాలు వాయిదా వేస్తూ వస్తున్నారు. వేణు శ్రీరామ్ బన్నీకి పర్ఫెక్టుగా సెట్టయ్యే కథ తయారు చేయడంతో దిల్ రాజు వెంటనే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ చేయించారు. అంతే కాదు... బన్నీకి సరిపోయే కథ రాసినందుకు ఖరీదైన కారును కూడా దర్శకుడికి గిఫ్టుగా అందించారు.

‘ఐకాన్' మొదలయ్యేది ఎప్పుడు?
అల్లు అర్జున్ ఆల్రెడీ త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలకు కమిట్మెంట్స్ ఇచ్చేశాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వేణు శ్రీరామ్-అల్లు అర్జున్ మూవీ ‘ఐకాన్.. కనబడుట లేదు' సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

అల్లు అర్జున్
‘నా పేరు సూర్య' తర్వాత అల్లు అర్జున్ దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. అతడి చేయబోయే నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ నెలలోనే లాంచ్ కాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ, అల్లు అర్జున్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











