వెకేషన్ టైం: ఫ్యామిలీతో మంచు పర్వతాల్లో విహరిస్తున్న అల్లు అర్జున్

Recommended Video

Allu Sirish Speech About His Father Aravind at ABCD Movie Pre Release Event || Filmibeat Telugu

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తుండటంతో సినిమా స్టార్స్ విదేశాల్లో వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరేమో తమ సినిమా షూటింగులు యూరఫ్ దేశాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న అల్లు అర్జున్..షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తవ్వడంతో చిల్ అయ్యేందుకు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి చలిప్రదేశమైన స్విట్జర్లాండులో పర్యటిస్తున్నారు. ఇక్కడి మంచు పర్వతాల్లో విహరిస్తూ సేదతీరుతున్నారు. తమ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను బన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వారం రోజులు అక్కడ గడిపిన అనంతరం తిరిగి ఇండియా రానున్నారు.

స్విస్‌లోని జెర్మాట్ సిటీలో...

స్విస్‌లోని జెర్మాట్ సిటీలో...

అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ప్రస్తుతం సౌత్ స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్ సిటీలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ వైఫ్‌గా వార్లోకి ఎక్కిన స్నేహారెడ్డి తమ ట్రిప్ విశేషాలు వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

లైఫ్‌లో ఎలా ఉండాలి? హ్యాపీగా...

లైఫ్‌లో ఎలా ఉండాలి? హ్యాపీగా...

తన భార్య పిల్లలతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసిన అల్లు అర్జున్.... ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. లైఫ్‌లో హ్యాపీగా ఉండాలని పేర్కొన్నారు. దీనికి ఓ అభిమాని స్పందిస్తూ... ‘‘హ్యాపీగా ఉండాలంటే నీలాగా హార్డ్ వర్క్ కూడా చేయాలి'' అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. కష్టపడి పని చేయడంలో నువ్వే మాకు స్పూర్తి అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

కూల్ డాడీ...

కూల్ డాడీ...

అల్లు అర్జున్‌కు తన పిల్లలంటే అమితమైన ప్రేమ. షూటింగ్ లేకుంటే ఇంట్లో పిల్లలతో గడపటానికే సమయం కేటాయిస్తారు. స్విట్జర్లాండ్‌ పర్యటనలో తాను మరింత కూల్ డాడీగా వ్యవహరించాల్సి వచ్చిందని బన్నీ పేర్కొన్నారు. అఫ్ కోర్స్ ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల పట్ల ఇంతే ప్రేమతో ఉంటారు, బన్నీ పెద్ద స్టార్ అయినప్పటికీ తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఓ అడుగు ముందే ఉంటున్నాడు.

అల్లు అర్జున్ 19

అల్లు అర్జున్ 19

గతంలో త్రివిక్రమ్‌తో కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసిన అల్లు అర్జున్ తన 19వ సినిమాతో మూడో సారి మాటల మాంత్రికుడితో కలిసి పని చేస్తున్నారు. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. స్విట్జర్లాండ్ ట్రిప్ పూర్తయిన తర్వాత సెకండ్ షెల్యూల్‌లో బన్నీ జాయిన్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X