మహేష్ గొడ్డలి పడితే.. అల్లు అర్జున్ కత్తి పట్టాడు.. ఇక సమరమే! హాట్ టాపిక్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్‌స్టార్ మహేష్ బాబు సమరానికి సిద్ధమవుతున్నారు. ఢీ అంటే ఢీ అనేలా యుద్ధం చేయడానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఒకరు గొడ్డలి పడితే.. మరొకరి కత్తి పట్టారు. ఇక గెలుపోటములు ఎవరికి దక్కుతాయో చూద్దాం అన్నట్లుగా దూకుడుగా ముందడుగేస్తున్నారు. ఆ సంగతులేంటో చూద్దామా..

సమరానికి సై.. ప్రేక్షకులకు కనువిందు
ఎప్పటిలాగే రాబోయే సంక్రాంతి ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సారి బాక్సాఫీస్ వార్‌లో యంగ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ తలపడుతున్నారు. సంక్రాంతి సమరానికి సై అంటూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ సమరం సంగతేంటో గానీ తమకు మాత్రం కనువిందు ఖాయం అని ఫిక్స్ అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు.

అల్లు అర్జున్ కత్తి.. మహేష్ గొడ్డలి
ఇటీవలే విడుదలైన `సరిలేరు నీకెవ్వరు`, `అల.. వైకుంఠపురములో` పోస్టర్స్ సంక్రాంతి సమరానికి ఇద్దరు స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పకనే చెప్పేస్తున్నాయి. `సరిలేరు నీకెవ్వరు` పోస్టర్ లో మహేష్ బాబు గొడ్డలి పట్టుకొని కనిపించగా, `అల వైకుంఠపురములో` పోస్టర్ లో అల్లు అర్జున్ కత్తి పట్టి కనిపించడం సమరానికి సై అయ్యన్నట్లుగా సంకేతమిచ్చాయి.

అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు
ఈ సంక్రాంతికి విడుదలకు సిద్దమైన రెండు భారీ సినిమాలు అల.. వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు అనగా (జనవరి 12) విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి మొదలైంది. అల్లు అర్జున్, మహేష్ బాబు ఇద్దరిలో ఎవరిది గెలుపు అనే క్యూరియాసిటీ నెలకొంది.

నువ్వా..నేనా అన్నట్లుగా
అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' విడుదల తేదీ ప్రకటించిన కొద్దిసేపటికే
మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ డేట్ చెప్పేశారు. దీంతో మహేష్ బాబు, అల్లు అర్జున్ పోటీ కన్ఫర్మ్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతుండగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది.

గతంలో కూడా ఇలాగే.. ఈ సారి మాత్రం
గతంలో కూడా మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. 'భరత్ అనే నేను', నా పేరు సూర్య' సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో క్లాష్ రావడంతో బన్నీ 'నా పేరు సూర్య' వెనక్కి తగ్గింది. కానీ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా మహేష్ బాబు, అల్లు అర్జున్ ఓకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.


Click it and Unblock the Notifications











