అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ పీఆర్ టీం ఓవర్ యాక్షన్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లో 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అవ్వగా... జూన్ 5 నుంచి రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది.
ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షెడ్యూల ఫ్రారంభం అవ్వడానికి ముందు పీఆర్ టీం ఓవర్ యాక్షన్ చేయడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. బన్నీ సినిమా గురించి ఫ్యాన్స్‌కి ఎగ్జైట్ చేసే న్యూస్ చెప్పబోతున్నాం అంటూ హడావుడి చేశారు.

దీంతో ఏదైనా ముఖ్యమైన విషయో? లేక బన్నీ తర్వాతి మూవీ గురించిన మ్యాటర్ అని అంతా ఊహించారు. తీరా చూస్తే సెకండ్ షెడ్యూల్ ప్రారంభానికి సంబంధించిన న్యూస్ చెప్పి ఉసూరుమనిపించారు. ఈ విషయంపై కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈ షెడ్యూల్ గ్యాపులో బన్నీ తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలైతే మళ్లీ ఫ్యామిలీతో గడిపే సమయం ఉండదు కాబట్టి షూటింగ్ గ్యాపులో ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో త్రివిక్రమ్‌తో కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసిన అల్లు అర్జున్ తన 19వ సినిమాతో మూడో సారి మాటల మాంత్రికుడితో కలిసి పని చేస్తున్నారు. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











