Allu Arjun: బన్నీ కొత్త సినిమా ప్రకటన.. హ్యాట్రిక్ హిట్ల తర్వాత మరోసారి.. ఎవరూ ఊహించని విధంగా!

టాలీవుడ్‌లోనే పెద్ద నిర్మాత కుమారుడిగా సినీ రంగం ప్రవేశం చేసినా.. తనదైన టాలెంట్లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హీరోగా పరిచయమైన కొత్తలోనే యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఫాలోయింగ్, మార్క్‌ట్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!

పాన్ ఇండియా స్టార్‌గా:కెరీర్ ఆరంభం నుంచీ పరిమితం అయిన అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ హిట్ అయింది. ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

 Allu Arjun and Trivikram Srinivas New Movie Announced

పుష్ప 2తో పాటు అది:అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న 'పుష్ప ది రూల్'లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తైంది. దీన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తీస్తున్నారు. దీనితో పాటు అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

 Allu Arjun and Trivikram Srinivas New Movie Announced

గురూజీతో మరోసారి:అల్లు అర్జున్ తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఇద్దరు దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేశాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనతో ఈ స్టార్ హీరో గతంలో'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల.. వైకుంఠపురములో' వంటి మూవీలు చేశాడు. ఈ మూడు సక్సెస్‌ల తర్వాత వీళ్లిద్దరూ మరో మూవీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

నాలుగోసారి కలిశారు:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి నాలుగో సినిమాను చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ వీడియోను కూడా వదిలింది. ఇక, ఈ సినిమాను అల్లు రామలింగయ్య, మమత సమర్ఫణలో గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

 Allu Arjun and Trivikram Srinivas New Movie Announced

ఈసారి వేరే లెవెల్‌లో:అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే మూడు చిత్రాలను చేశాడు. ఇవన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా రూపొందించారు. అయితే, ఇప్పుడు చేయబోయే చిత్రం మాత్రం ఎవరూ ఊహించని కంటెంట్‌తో రాబోతుందట. ఈ సారి అన్నింటికంటే హై రేంజ్ మూవీని వీళ్లిద్దరూ అందించబోతున్నట్లు తాజాగా విడుదల చేసిన వీడియోలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X