కేరళలో అల్లు అర్జున్ పవర్.. టీఆర్పీలో ‘అల’ దూకుడు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో.. మళయాంలోనూ అంతే క్రేజ్ ఉంది. బన్నీ సినిమా వస్తుందంటే కేరళ స్టార్స్ సైతం పక్కకు తప్పుకుంటారు. అంతలా భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక్కడి అల్లు అర్జున్ కాస్తా.. అక్కడ మల్లు అర్జున్‌గా మారిపోయాడు. బన్నీ సినిమాలు ఇక్కడ యావరేజ్ అయినా అక్కడ మాత్రం సూపర్ హిట్ అవుతాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన అల వైకుంఠపురములో కేరళలోనూ దుమ్ములేపింది.
ఇక ఇప్పటికే బాక్సాఫీస్ లెక్కలన్నీ అందరూ కళ్లారా చూశారు. దాదాపు 250 కోట్లు కొల్లగొట్టిన అల వైకుంఠపురములో బన్నీ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కేరళలో రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ లెక్కల్లో కాకుండా టీఆర్పీ లెక్కల్లో బన్నీ కొత్త రికార్డులను కొల్లగొట్టాడు. అసలే మన తెలుగు వాళ్లకు అల వైకుంఠపురములో సినిమాను వెండితెరపై చూడాలని ఎంతో ఆత్రుత ఉంది. కానీ మనకు ఇంకా బుల్లితెరపై ఈ చిత్రం ప్రసారం కాలేదు.

కానీ కేరళలో మాత్రం బుల్లితెరపైనా బన్నీ సందడి చేశాడు. ఒక్కసారి కాదు రెండో సారి కూడా బన్నీ దుమ్ములేపాడట. ఈ విషయాన్నికేరళ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కాలర్ ఎగిరేసి మరి చెబుతున్నాయి. మొదటి సారి ప్రసారం చేసినప్పుడు 11.17 టీఆర్పీ సాధించగా.. రెండోసారీ అదిరే రేటింగ్ తెచ్చుకుందట. గత వారం ప్రసారం చేసిన అంగు వైకుంఠపురతు చిత్రానికి 9.2రేటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని బుట్టబొమ్మ, రాములో రాముల పాటల క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది.



Click it and Unblock the Notifications











