కొత్త కాంట్రవర్సీలోకి అల్లు అర్జున్.. మెగా హీరో ఫ్యాన్స్ ఫైర్!
సినిమాల పరంగా అయితే టాలీవుడ్ నుంచి పాన ఇండియా మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకున్న హీరోల జాబితాలో అల్లు అర్జున్ ఖచ్చితంగా నిలుస్తాడు. ఎలాంటి రాజమౌళి మార్క్ లేకుండా తన స్టామినాతోనే అంతా సొంతం చేసుకున్నాడు. కానీ అల్లు అర్జున్ కొన్ని చర్యలు మాత్రం ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తీస్తున్నాయి.
కొన్ని వారాల కితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన రచ్చ కోసం తెలియంది కాదు. దీనిపై స్వయంగా అల్లు అర్జున్ నాన్న, స్టార్ నిర్మాత అల్లు అరవింద్ పవన్ దగ్గరకి వెళ్లి మాట్లాడారని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. కాగా ఇది ఇలా తగ్గుతుంది అనుకుంటే మరో షాకింగ్ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

అందుకు తగ్గట్టుగానే పి ఆర్ మార్కెట్ కూడా బన్నీ అండ్ అల్లు సంస్థకి ఉంది. మరి బన్నీకి ఇతర మెగా హీరోలకి ఏమన్నా పడట్లేదో ఏమో కానీ మొన్న పవన్ విషయం అయ్యిన తర్వాత ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కాంట్రవర్సీ రేగింది. తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ పి ఆర్ చర్యల విషయంలో ఫైర్ అవుతున్నారు.
ఇక మరింత లోతుగా వెళితే అల్లు అర్జున్ పి ఆర్ శరత్ చంద్ర తన హీరోగా అల్లు అర్జున్ వరకు ఎవరైనా వస్తే నేను ఖచ్చితంగా అడ్డు పడతాను అని చెప్పాడు. ఇది బాగానే ఉంది కానీ అదే ట్వీట్ లో నేను 'రామ్ చరణ్ గారి పి ఆర్ లా చేయను అంటూ' సోషల్ మీడియాలో ఓ హ్యాండిల్ ని పెట్టి వారు రామ్ చరణ్ కోసం పని చేస్తున్నారు అన్నట్టు కామెంట్స్ చేసాడు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే అసలు ఆ హ్యాండిల్ కి రామ్ చరణ్ కి సంబంధమే లేదని వారి 100 ట్వీట్స్ లో ఒక్కటి చరణ్ మీద ఉంటే అది రామ్ చరణ్ పి ఆర్ అకౌంట్ ఎలా అవుతుంది అని చరణ్ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధించారు.

దీనితో అత్యావేశంగా ట్రిగ్గర్ చేసిన శరత్ చంద్ర ఆ తర్వాత తన ఆ ట్వీట్ ని డిలీట్ కూడా చేసేసాడు. దీనితో రామ్ చరణ్ కి సరైన పిఆర్ టీమే లేనప్పుడు కావాలని అల్లు అర్జున్ అండ్ తన పి ఆర్ టీం మెగా హీరోస్ ని టార్గెట్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో గట్టిగా ఫైర్ అవుతున్నారు. అసలు అక్కడ చరణ్ పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చరణ్ అభిమానుల వాదన. ఇలా మొత్తంగా అయితే మెగా హీరోల విషయంలో బన్నీ సర్కిల్స్ నుంచి పరిస్థితులు అంతకంతకూ కాంట్రవర్సీకే దారి తీస్తుండగా సోషల్ మీడియాలో ఇప్పుడు చరణ్, అల్లు అర్జున్ అభిమానుల నడుమ రచ్చ నడుస్తుంది.
మరి ఈ విషయాల్లో అల్లు అర్జున్ కలుగజేసుకొని ఏమన్నా సెటిల్ చేస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ అయితే దర్శకుడు సుకుమార్ తో భారీ చిత్రం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఇప్పుడు క్లైమాక్స్ సన్నివేశాల్లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇక ఇంకో పక్క రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో తన "గేమ్ ఛేంజర్" పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇందులో కియారా అద్వానీ, అంజలిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











