బన్నీ రికార్డ్ ముందు పవన్ ఒక్కడే.. మహేష్, ప్రభాస్ డౌన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల రికార్డులు చాలా రకాలుగా పూట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు కలెక్షన్స్ కంటే కూడా ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడింది అనే దానిపై చర్చలు జరిగేవి. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వలన స్టార్స్ రేంజ్ మారిపోతోంది. హ్యాష్ ట్యాగ్స్ తోనే అభిమానులు వారి హీరోల రేంజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

బన్నీ తగ్గట్లేదుగా..
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి సోషల్ మీడియాలో అత్యధిక క్రేజ్ అందుకుంటున్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బన్నీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లలో హ్యాష్ ట్యాగ్ తో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక ఇటీవల టిక్ టాక్ లో కూడా అల్లు అర్జున్ పేరుతో అత్యధిక హ్యాష్ ట్యాగ్స్ వ్యూవ్స్ వచ్చాయి.

ట్రెండ్ సెట్..
బన్నీ రికార్డ్ ముందు మహేష్, ప్రభాస్ కొంచెం తగ్గరనే చెప్పాలి. టిక్ టాక్ లో అల్లు అర్జున్ పేరుతో దాదాపు 4.03 బిలియన్ హ్యాష్ ట్యాగ్ వ్యూవ్స్ వచ్చాయి. చాలా వరకు బన్నీ బుట్టబొమ్మ సాంగ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ వైడ్ గా టిక్ టాక్ లో ఆ సాంగ్ కి గుర్తింపు దక్కింది. దీంతో బన్నీ రేంజ్ కూడా పెరిగింది.

పవన్ ఒక్కడే..
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒక్కడే టిక్ టాక్ హ్యాష్ ట్యాగ్ లో బన్నీ రికార్డ్ కి దగ్గరగా వెళుతున్నాడు. జనసేన పార్టీతో పాటు వకీల్ సాబ్ మగువ మగువ సాంగ్ కారణంగా పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా వైరల్ చేశారు. పవన్ కళ్యాణ్ 2.65బిలియన్ హ్యాష్ ట్యాగ్ వ్యూవ్స్ తో తన పవర్ చూపిస్తున్నాడు.

మహేష్, ప్రభాస్ చాలా తక్కువ..
బన్నీ, పవన్ కళ్యాణ్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఇటీవల బాగా వైరల్ అయ్యింది. 2.12బిలియన్ తో మూడవ స్థానంలో ఉండగా.. ప్రభాస్ 1.8బిలియన్, మహేష్ 1.4 బిలియన్ టిక్ టాక్ హ్యాష్ ట్యాగ్స్ తో తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక రామ్ చరణ్ 1 బిలియన్, న్యాచురల్ స్టార్ నాని 681 మిలియన్స్ తో స్టార్ హీరోలకు పోటీని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











