Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆర్య, సాయేషా పెళ్లి సందడి.. సంగీత్‌లో అల్లు అర్జున్ కేక.. బుగ్గపై ముద్దుపెట్టి..!
తమిళ హీరో, హీరోయిన్లు సాయేషా సైగల్, ఆర్య పెళ్లి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో వీరిద్దరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పెళ్లిలో భాగంగా శనివారం రాత్రి సంగీత్ కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య జరిగింది. ఈ వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేక పుట్టించారు. వివరాల్లోకి వెళితే..
మహర్షికి మరో తలనొప్పి.. కోతల వాతలతో గందరగోళం!
అల్లు అర్జున్ పెళ్లి సందడి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాకతో సంగీత్ కార్యక్రమంలో సందడిగా మారింది. నూతన దంపతులు ఆర్య, సాయేషాను అల్లు అర్జున్ ఆప్యాయంగా పలుకరించారు. అల్లు అర్జున్ రావడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. నూతన వధూవరుల ఆనందంలో స్టైలిష్ స్టార్ భాగమయ్యారు.
బుగ్గపై ముద్దుపెట్టి శుభాకాంక్షలు
ఆర్య, సాయేషాలకు అల్లు అర్జున్ వివాహా శుభాభినందనలు తెలిపి.. వారిని ప్రేమతో కౌగిలించుకొన్నారు. ఇద్దరికి బుగ్గుపై ప్రేమతో ముద్దు పెట్టి తన సంతోషాన్ని పంచుకొన్నారు. వివాహా శుభాకాంక్షలు అందజేశారు. అల్లు అర్జున్ కనిపించగానే పెళ్లి వేదిక వద్ద కొత్త ఎనర్జీ కనిపించింది.
సినీ దిగ్గజాలు
ప్రముఖ సినీ దిగ్గజాలు దిలీప్ కుమార్, సైరా భాను మనువరాలు సాయేషా అనే విషయం తెలిసిందే. ఆర్య, సాయేషా పెళ్లికి హైదరాబాద్ వేదికగా మారడం గమనార్హం. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరుకావడం విశేషంగా మారింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజీగా మారిన ఈ పెళ్లికి సంబంధించిన వేదికను చాలా గోప్యంగా ఉంచారు.
సంజయ్ దత్
యాంగ్రీ హీరో సంజయ్ దత్ ఈ సెలబ్రేషన్లో ప్రత్యేక ఆకర్షణగా మారారు. అలనాటి నటి అంజు మహేంద్రు, సూరజ్, ఆదిత్య పంచోలి ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు. అలనాటి అందాల తార సైరా భాను మనవరాలి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. ఆదివారం రాత్రి ఆర్య, సాయేషా పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు.