AA22 : అల్లు అర్జున్ - అట్లీ సినిమా కథ ఏంటో తెలుసా? హాలీవుడ్ కు తగ్గకుండా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2 ది రూల్ చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద ఏకంగా 1870 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి సంచలనంగా మారింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో రెండవ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు 2021 లో వచ్చిన పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఏకంగా బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసింది.

ఇలా పుష్ప చిత్రంతో బ్యాక్ టు బ్యాక్ రికార్డులను క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇక నెక్స్ట్ తన రాబోయే చిత్రాన్ని మరింత గ్రాండ్ గా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన రాబోయే 22 వ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని కూడా మేకర్స్ అందించారు. కోలీవుడ్ చిత్రాలను నిర్మించే అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అట్లీ- అల్లు అర్జున్ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Allu Arjun Atlee movie Story Leak Do you know what is the main plot

అల్లు అర్జున్ - అట్లీ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై అంతకంతకు అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఏకంగా హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లను రంగంలోకి దించడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు, ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అట్లీ అల్లు అర్జున్తో తీయబోతున్న కథ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తాజాగా ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ మాత్రం బయటికి వచ్చింది.

అల్లు అర్జున్ అట్లీ చేయబోయే సినిమా టైం ట్రావెల్ లో ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్ చిత్రం ఇంటర్ స్టెల్లార్ చిత్రం తరహాలో కాల ప్రయాణం చేయబోతున్నారంట అల్లు అర్జున్. ప్రపంచాన్ని కాపాడడం కోసం, శాంతిని కల్పించే మిషన్ పై అల్లు అర్జున్ పనిచేస్తారని తెలుస్తోంది. అందుకోసమే కాలంలో ప్రయాణించి విపత్తులను అడ్డుకుంటారని అంటున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైమెన్షన్ ట్రావెలర్ గా అలరించబోతున్నారు. ఈ సినిమా లో రెడ్ అండ్ బ్లూ.. అనే రెండు ప్రపంచాలను చూపించబోతున్నారట దర్శకుడు అట్లీ.

ఈ క్రమంలోనే భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, కొత్త రకమైన డ్రామా చూడబోతున్నారంటూ సిరి ప్రముఖులు అంటున్నారు. ఇలాంటి కథలు ఎక్కువగా హాలీవుడ్ సినిమాలో చూస్తూ ఉంటాం. ఇక అట్లీ హాలీవుడ్ రేంజ్ కు తగ్గట్టుగా కథను రెడీ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అవెంజర్స్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఆక్వా మెన్ వంటి చిత్రాలకు విఎఫ్ఎక్స్ అందించిన హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ 800 కోట్ల బడ్జెట్తో నిర్మించబోతున్నారు. హీరోయిన్ గా సమంత ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. సాయి అభ్యంకర్ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎంపికయ్యారు.

More from Filmibeat

Read more about: allu arjun atlee aa22
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X