AA22 : హాలీవుడ్ రేంజ్.. అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ కు టాప్ టెక్నీషియన్లు వీరే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2 చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారు చూశాం. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1870 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనంగా మారాడు అల్లు అర్జున్. దీంతో ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో 2వ సినిమాగా రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందే పుష్ప చిత్రంతో నేషనల్ అవార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా పుష్ప ఫ్రాంచైజీ తో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు వరల్డ్ మొత్తం షాక్ అయింది. మరోవైపు అల్లు అర్జున్ సినిమాలకు మరింతగా డిమాండ్ పెరిగింది.
అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాలను గ్రాండ్ గా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే నిర్మాత, దర్శకుడు, హీరోయిన్లు, తదితరు అంశాల్లో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అట్లీ బాలీవుడ్ లో చివరిగా జవాన్ చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఎలాంటి సినిమాను తీయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ ప్రాజెక్టు గురించి మొన్నటి వరకు అసత్య ప్రచారాలు జరిగాయి. భారీ బడ్జెట్ కారణంగా సినిమా ఆగిపోయిందని పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక అన్నింటికీ పుల్ స్టాప్ పెట్టేలా అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్టు నుంచి సాలిడ్ అప్డేట్ అందింది. ఈ చిత్రాన్ని అలా ఇలా కాకుండా హాలీవుడ్ రేంజ్ లో నిర్మించబోతున్నట్లు మేకర్స్ సన్ పిక్చర్స్ వారు ప్రీ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేశారు. రూ.600 కోట్లతో సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఆ వీడియోలో మేకర్స్ AA22 ప్రాజెక్టు ద్వారా వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేసినట్టు తెలిపారు. ఇందుకోసం ఇండియాతో పాటు యూఎస్ లోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలను సంప్రదించినట్టు ప్రకటించారు.
ప్రపంచంలోనే బెస్ట్ వీఎఫ్ ఎక్స్ కంపెనీలు.. లోలా VFX సహా ప్రఖ్యాత స్టూడియోలు స్పెక్ట్రల్ మోషన్, ఫ్రాక్టర్డ్ ఎఫ్ఎక్స్, ఐఎల్ఎం, ఐరన్ హెడ్ స్టూడియో, లెగసీ ఎఫెక్ట్స్ తో కలిసి పనిచేయబోతున్నారు. ఐరాన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వంటి చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించిన సంస్థలు అఅల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ లో కొలాబరేట్ కావడం సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది. అలాగే స్పైడర్ మ్యాన్ కు వీఎఫ్ ఎక్స్ అందించిన ఆర్ట్ డైరెక్టర్ జోస్ ఫెర్నాండెజ్, ఐరన్ మ్యాన్ వీఎఫ్ఎక్స్ సూప్ వైజర్ జేమ్స్ మడిగన్, ఆర్టిస్టిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు నామినీ మైక్ ఎలిజల్డీ, అక్వామెన్ మూవీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ జస్టిన్ వంటి వరల్డ్ టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
గ్రహంతరవాసులు, లేటెస్ట్ వెపన్స్, గ్రాండ్ ఆర్ట్స్ తో సినిమా రూపుదిద్దుకోబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని ఆ వీడియో తెలియేస్తోంది. మరోవైపు టెక్నీషియన్లు అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ కథను విని షాక్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన పాత్ర కోసం 3D స్కానింగ్ కూడా చేయించుకున్నారు. సాయి అభ్యాంకర్ ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందించబోతున్నారని తెలుస్తోంది. మున్ముందు మరిన్ని అప్డేట్స్ రాబోతున్నట్టు అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











