యంగ్ హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ఆ డిజాస్టర్ తర్వాత ఏం జరిగింది?
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారుతోంది. గతంలో 'వరుడు' హీరోయిన్ భాను శ్రీ మెహ్రాతో జరిగిన ట్విట్టర్ ఘటన, అలాగే ఇటీవల చర్చనీయాంశమైన '42 రూల్స్' ఆరోపణలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు చుట్టూ హాట్ డిబేట్ జరుగుతోంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు, ఇతర స్టార్ హీరోల అభిమానుల మధ్య మొదలైన ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. అసలేం జరిగిందంటే..?
'42 రూల్స్' వివాదం
ఇటీవల అల్లు అర్జున్‌పై ప్రొటో కాల్ రూల్స్ అంటూ ఆరోపణ సోషల్ మీడియాలో కలకలం రేపింది. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు ఆయన టీమ్ 42 నియమాల జాబితా ఇచ్చిందని చెప్పారు. ఆ లిస్ట్‌లో.. కళ్లలోకి చూడకూడదనీ, హ్యాండ్‌షేక్ చేయకూడదని పేర్కొన్నారు. అంతే కాకుండా మూడు అడుగుల దూరం పాటించాలనీ, సెట్‌లో ఫోన్ వాడకూడదనే పలు నియమాలున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఈ క్లిప్ వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు మండిపడ్డారు. వెంటనే అల్లు అర్జున్ టీమ్ అధికారిక స్టేట్‌మెంట్ విడుదల చేసి, ఇవన్నీ పూర్తిగా అవాస్తవమని, నిరాధార ఆరోపణలని తేల్చిచెప్పింది. అవసరమైతే డిఫమేషన్ కేసు వేస్తామని కూడా హెచ్చరించింది. అనంతరం పలువురు దర్శకులు, టెక్నీషియన్లు, సహ నటులు కూడా ముందుకు వచ్చి.. 'అల్లు అర్జున్ చాలా డౌన్ టు ఎర్త్. ఇలాంటి రూల్స్ ఎప్పుడూ చూడలేదు'అంటూ ఆయనకు మద్దతుగా మాట్లాడారు.
ఈ వివాదం పెద్దదిగా మారడంతో కావేరి బారువా ఫిబ్రవరి 15న సోషల్ మీడియా వేదికగా క్షమాపణ (పబ్లిక్ అపాలజీ) పెట్టారు. తన వ్యాఖ్యలకు ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేవని, అవి ధృవీకరణ లేనివని అంగీకరించారు. తన మాటల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొంటూ స్టేట్‌మెంట్‌ను పూర్తిగా విత్‌డ్రా చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ అపాలజీ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్ మరింత ముందు వచ్చి 'అల్లు అర్జున్ 23 ఏళ్ల కెరీర్‌లో ఒక్క నటుడు గానీ, టెక్నీషియన్ గానీ ఆయన గురించి చెడుగా మాట్లాడలేదు. అందరూ ఆయన హార్డ్ వర్క్ గురించే చెబుతారు. చాలామంది తమ కొడుకులు ఆయనలా ఉండాలని కోరుకుంటారు. ఇది ముగింపు కాదు... కర్మ ఎప్పుడూ తిరిగి వస్తుంది!' అంటూ కామెంట్ చేశారు. అలాగే.. అల్లు అర్జున్ ఇమేజ్‌కు ఏమీ కాలేదు, నిజం బయటపడింది అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
దీంతోమరోవైపు ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రం సర్కాస్టిక్ పోస్టులతో స్పందిస్తున్నారు. దీనికి ప్రతిగా రెబల్ ఫ్యాన్స్ సర్కాస్టిక్‌గా స్పందిస్తూ 'ఈవిడ ఎవరు మరి? హాలీవుడ్ నుంచి వచ్చిందా?' అని అంటూ.. 2023లో అల్లు అర్జున్- వరుడు హీరోయిన్ భాను శ్రీ మెహ్రా మధ్య జరిగిన వివాదాన్ని తెరపైకి తీసుకవచ్చారు. ఈ క్రమంలో ఒకవైపు ఫ్యాన్స్ బన్నీని గట్టిగా డిఫెండ్ చేస్తుండగా, మరోవైపు ఇతర అభిమానులు సర్కాస్టిక్ కామెంట్స్‌తో ఫ్యాన్ వార్‌ను మరింత వేడెక్కిస్తున్నారు. ఆరోపణలు, కౌంటర్లు, పబ్లిక్ అపాలజీలు... ఇలా సోషల్ మీడియాలో సాగుతున్న ఈ డ్రామా ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అసలు వివాదం ఏంటీ?
ఈ వివాదం 2023 మార్చిలో మొదలైంది. భాను శ్రీ మెహ్రా అప్పట్లో సరదాగా చేసిన ఓ ట్వీట్‌లో 'వరుడు సినిమాలో అల్లు అర్జున్‌తో నటించాను. అయినా నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్‌లో బ్లాక్ కూడా చేశాడు!' అని హాస్యంగా రాసింది. ఆ ట్వీట్ వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. కొందరు ఆమె అల్లు అర్జున్ కెరీర్‌ను బ్లేమ్ చేస్తున్నట్టు విమర్శించారు. వెంటనే భాను శ్రీ మెహ్రా మరో ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.
'నేను ఎప్పుడూ అల్లు అర్జున్‌ను నా కెరీర్‌కు బాధ్యుడిగా చెప్పలేదు. నా స్ట్రగుల్స్‌ను సరదాగా చెప్పాను అంతే. ఇప్పుడు ఆయన నన్ను అన్‌బ్లాక్ చేశారు' అని స్పష్టం చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం చల్లారిపోయినా... ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ అకౌంట్స్ మధ్య చర్చకు వచ్చింది.ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











