Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బన్నీకి క్రేజీ బర్త్ డే విషెస్.. అల్లు అర్జున్ గుట్టురట్టు చేసిన కాజల్ అగర్వాల్
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 8). ఈ మేరకు బన్నీ బర్త్ డే దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా ట్వీట్ చేయడం, బన్నీ ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్లతో నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. బన్నీ బర్త్ డేతో పాటు, కొత్త సినిమా అప్ డేట్ కూడా ఇవ్వడంతో సోషల్ మీడియా మొత్తం వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంది. బన్నీ కొత్త సినిమా టైటిల్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయిందంటేనే దాని హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సెలెబ్రిటీల విషెస్..
టాలీవుడ్ సెలెబ్రిటీలంతా అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపారు. బన్నీతో కలిసి పని చేసిన హీరోయిన్లు, నటీనటులు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు చేసిన ట్వీట్స్, బన్నీ ఇచ్చిన రిప్లైలు తెగ వైరల్ అయ్యాయి. అన్నింట్లో కెల్లా మెగా విషెస్, వాటికి బన్నీ ఇచ్చిన రిప్లైలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
మెగా విషెస్..
అల్లు అర్జున్‌కు మెగా విషెస్ లభించాయి. చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన చిరంజీవి.. బన్నీలోని డ్యాన్స్, గ్రేస్ గురించి ప్రస్తావించాడు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ బన్నీకి విషెస్ తెలిపారు. చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ చెప్పిన విషెస్ అందర్నీ ఆకట్టుకున్నాయి.
|
కాజల్, రకుల్ విషెస్..
బన్నీతో కలిసి నటించిన కాజల్, రకుల్‌లు స్పెషల్ విషెస్ పంపించారు. ‘హ్యాపియెస్ట్ బర్త్ అల్లు అర్జున్.. ప్రేమ, శుభాకాంక్షలను పంపుతున్నాను.. భగవంతుడి ఆశీస్సులు నీకుండాల'ని కాజల్ ట్వీట్ చేయగా.. థ్యాంక్యూ సో మచ్ డియర్ అంటూ రిప్లై ఇచ్చాడు.
Recommended Video
తాజాగా మరో ట్వీట్..
ఆర్య 2 నాటి ఫోటోలను షేర్ చేస్తూ ఆ సమయంలో ఎంతలా తిరిగారో, ఎంత ఎంజాయ్ చేశారో చెబుతూ మీ అందరికీ గుర్తుందా? అని నవదీప్, శ్రద్దాదాస్ను ప్రశ్నించింది. ఈ ఫోటోలను చూస్తుంటే ఆ సమయంలో బన్నీ చెలరేగిపోయిన్టట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోలన్నీ వెతికి పట్టుకోవడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.