Allu Arjun Birthday: అల్లు అర్జున్ బర్డ్ డే స్పెషల్..AA22XA6 సినిమా గురించి క్రేజీ న్యూస్!
పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ అంటూ ఎదురు చూస్తున్న స్టైలిష్ స్టార్ అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్తను అందించింది. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన ఫ్యాన్స్‌కు క్రేజీ అప్ డేట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అవుతున్నది. ఈ సినిమా గురించి అప్ డేట్, ఇతర విశేషాల వివరాల్లోకి వెళితే..
అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ చిత్రంగా రూపొందుతున్న (AA22XA6) ఈ చిత్రంలో దీపిక పదుకోన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, రమ్యకృష్ణన్, జిమ్ సరబ్, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాను కళానిధి మారన్, అశోక్ నారాయణన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా, ఆంథోని ఎల్ రుబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో అంచనాలు పెంచేసుకొన్నది.

అయితే ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు మంచి న్యూస్ అందించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమా టైటిల్ రివీల్, అలాగే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్‌ను, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు. ఈ సినిమా స్పెషల్ ప్రాజెక్ట్ కావడం వల్ల అన్ని విషయాలను సీక్రెట్‌గా పెట్టి మూవీపై క్యూరియాసిటినీ పెంచుతున్నాం అని ఆయన తెలిపారు.
ఇక ఈ సినిమాకు ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. AA22XA6 వర్కింగ్ టైటిల్‌తో సినిమా పీ ప్రొడక్షన్ పనులు అట్టహాసంగా ప్రారంభించారు. గ్రాఫిక్ వర్క్, వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ మూవీ కోసం స్పైడర్ మ్యాన్ ఆర్ట్ డైరెక్టర్ జోస్ ఫెర్నాండెజ్, ఐరన్ మ్యాన్ VFX సూపర్‌వైజర్ జేమ్స్ మడిగన్, ఆర్టిస్టిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు నామినీ మైక్ ఎలిజల్డీ, అక్వామెన్ మూవీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ జస్టిన్ తదితరులు పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











