NTR బాటలో అల్లు అర్జున్.. ఎన్టీఆర్ పెట్టిన ప్లేస్ లోనే పెట్టుబడులు!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఫాలో అవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఫాలో హిందీ సినిమాల విషయంలో లేక మరే ఇతర విషయాల్లో కాదు పెట్టుబడుల విషయంలో. అవును ఎన్టీఆర్ పెట్టుబడి పెట్టిన చోట ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పెట్టుబడి పెట్టడం ఆసక్తికరంగా మారింది.. ఈ అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

అలా పెట్టుబడి
సినిమా హీరోలు ఒకపక్క సినిమాలు చేస్తూ సంపాదించిన డబ్బును ఎక్కువగా భూముల మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. వేరే వేరే వ్యాపారాల మీద పెడితే నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ ఉండాలి, అందుకే ఎక్కువగా సినీ సెలబ్రిటీలు భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా ఉంచడం వల్ల వాటి వ్యాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలో కొంత భూమి కొనుగోలు చేశారు.

ఎన్టీఆర్ లాగానే
హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి తాసిల్దార్ కార్యాలయంలో జూలై నెలలో ఎన్టీఆర్ సందడి చేశారు. ఆయన అప్పుడు ఆరు ఎకరాల 30 సెంట్ల భూమి కొనుగోలు చేశారు. గోపాలపురం గ్రామంలో ఈ ఆరు ఎకరాల భూమిని ఆయన రిజిస్ట్రేషన్ కోసం శంకర్పల్లి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో అక్కడివారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం యం దాదాపు మీడియా వరకు వచ్చింది. ఇప్పుడు ఇదే విషయంలో అల్లు అర్జున్ ఎన్టీఆర్ ని ఫాలో అయ్యారు.

రెండు ఎకరాల భూమి
ఆయన కూడా శంకర్పల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఈరోజు ఉదయం సడన్ గా కనిపించారు.. అల్లు అర్జున్ కూడా ఒక భూమి కొనుగోలుకు సంబంధించిన విషయాలు అక్కడికి వెళ్ళారు అని తెలుస్తోంది. శంకర్పల్లి మండలంలో జొన్నవాడ గ్రామం పరిధిలో ఉన్న రెండు ఎకరాల భూమిని అల్లు అర్జున్ కొనుగోలు చేయగా ఈ రోజు రిజిస్ట్రేషన్ నిమిత్తం అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినట్లు సమాచారం.

అలా చేయడంతో సోషల్ మీడియాకు
ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎలా అయితే ఎగబడి ఫోటోలు తీసుకున్నారో, అల్లు అర్జున్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా అక్కడ సిబ్బంది ఇతర పనుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు ఫోటోలు తీసుకున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయం మళ్ళీ మీడియా దాకా వచ్చింది.

ఆర్ఆర్ఆర్ బిజీ
ఇక ఆ సంగతి అలా ఉంచితే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా జనవరి ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది.

అల్లు అర్జున్ పుష్ప
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రా అండ్ రస్టిక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తం రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే పుష్ప యూనిట్ అధికారికంగా అధికారికంగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications











