Ghani: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి బన్నీ.. ఆ సిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరంటే కొందరు మాత్రమే మంచి టాలెంట్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను కూడా అందుకున్నారు. అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే జాతీయ స్థాయిలో ఫేమస్ అయిన అతడు.. ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్నాడు. అదే సమయంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో సక్సెస్‌ల పరంపరతో వరుణ్ తేజ్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

గతంలో ఎన్నడూ లేనంత జోష్‌తో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంతో రూపొందింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం చాలా ఆలస్యంగా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించి.. వాటిని కూడా ఎంతో వేగంగా కంప్లీట్ చేసేశారు. తద్వారా సినిమాను విడుదలకు సిద్ధం చేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో బాక్సింగ్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మూవీ యూనిట్ ఎప్పుడో నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన దీన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్‌ 24కు వాయిదా వేశారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ పూర్తి కాకపోవడంతో ఈ చిత్రాన్ని ఏకంగా మార్చి 18న అనుకున్నారు. కానీ, ఆ తర్వాత ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించి.. భీమ్లా నాయక్ విడుదల కారణంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

Allu Arjun Chief Guest For Ghani Pre Release Event

వరుణ్ తేజ్ నటించిన 'గని' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రచార చిత్రాలను విడుదల చేయాలని భావించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఉక్కు నగరం విశాఖపట్నంలో ఆరోజు సాయంత్రం నుంచి ఈ వేడుక జరగబోతుంది. ఇక, దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'గని' మూవీలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X