‘పుష్ప’లో బన్నీ పాత్రపై క్రేజీ న్యూస్: సినిమాలో ప్రధాన ఆకర్షణ అవే అంటున్నారే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పుష్ప'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అందులో మొదటి భాగానికి సంబంధించి చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన చిత్రీకరణ కూడా అతి త్వరలోనే కంప్లీట్ కాబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమా కోసం అతడు అక్కడి యాసను కూడా నేర్చుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆ పాంతానికి చెందిన గిరిజన యువకుడిగా బన్నీ నటిస్తున్నాడట. అంతేకాదు, అతడి నోటి వెంట చెప్పే చిత్తూరు యాస డైలాగులు సినిమాలో అరుపులు పెట్టించే విధంగా ఉంటాయని తెలుస్తోంది. పోలీసులతో జరిగే యాక్షన్ సీన్‌లో ఐకాన్ స్టార్ యాక్టింగ్ అరాచకమే అని తెలిసింది. ఇప్పటికే పూర్తైన చిత్రీకరణ ఇవి ఎంతో హైలైట్‌గా వచ్చాయని అంటున్నారు.

 Allu Arjun Chittoor Slang Dialogues Highlight in Pushpa

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారట. ఇక, ఇందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X