విజయ్ దేవరకొండ తరువాత ఆ వ్యాపారంలోకి అల్లు అర్జున్.. మహేష్ కంటే హై లెవెల్లో..
నేటితరం స్టార్ హీరోలు కొందరు చాలా వరకు ఎదో ఒక బిజినెస్ తో బ్యాక్ గ్రౌండ్ ను పటిష్టంగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో బిజినెస్. అయితే వీలైనంత వరకు రిస్క్ లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకోవడం కొంతమందికే సాధ్యమయ్యింది. అయితే ఏషియన్ సినిమాస్ సంస్థ స్టార్ హీరోలతో కలిసి సరికొత్త మల్టీప్లెక్స్ లకు శ్రీకారం చుడుతోంది. అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఆ బిజినెస్ ను స్టార్ట్ చేయనున్నాడు.

ఏషియన్ సినిమాస్ సరికొత్త ప్లాన్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సినిమాస్ తన బిజినెస్ ను మరింత పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ను కూడా మల్టీప్లెక్స్ లుగా మార్చేస్తున్నారు. కొన్ని లీజుకు తీసుకొని మెయింటైన్ చేస్తుండగా మరికొన్నిటిని సొంతంగా కొనుగోలు చేసి రీ డిజైన్ చేస్తున్నారు.

AMB తరహాలోనే
ఇక మహేష్ బాబుతో కలిసి హైదరాబాద్ లో AMB సినిమాస్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దేశంలోనే నెంబర్ వన్ టెక్నాలజీతో సిద్ధం చేసిన AMB సినిమాస్ కు ఆదరణ భారీగానే దక్కింది. అయితే ఇప్పుడు మిగతా హీరోలు కూడా అదే తరహాలో ఏషియన్ సినిమాస్ తో చేతులు కలుపుతున్నారు.

విజయ్ దేవరకొండ కూడా..
మహబూబ్ నగర్ లో కూడా విజయ్ దేవరకొండ పాట్నర్ షిప్ తో AVD సినిమాస్ ను రెడీ చేస్తున్నారు. ఒక పాత థియేటర్ ను కొనుగోలు చేసి పూర్తిగా రూపురేఖలను మార్చేస్తున్నారు. ఆ ఏరియాలో మొదటిసారి బిగ్ స్క్రీన్ ను పరిచయం చేయబోతున్నారు. త్వరలోనే స్టార్ట్ కానున్న ఆ థియేటర్ లో మొదట వకీల్ సాబ్ షోలు పడనున్నాయి.

AAA సినిమాస్
ఇక ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ మార్కెట్ లోకి దిగాడు. అమీర్ పెట్ లోని సత్యం థియేటర్ స్థలంలోనే భారీ మల్టీప్లెక్స్ కు శ్రీకారం చుట్టారు. దానికి AAA సినిమాస్ అని బోర్డ్ పెట్టారు. అల్లు అర్జున్ పోస్టర్ ఉండడంతో ఏషియన్ సినిమాస్ బన్నీని కూడా ఇందులోకి లాగినట్లు అర్ధమవుతోంది. ఈ విధంగా స్టార్ హీరోలు సరికొత్తగా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగుతున్నారు. మరి ఏ రేంజ్ లాభాలను అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











