ఇందుకోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నా..: చిరంజీవిపై అల్లు అర్జున్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఇకపై సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండబోతున్నారు. ఈ మేరకు ఉగాది పర్వదినాన ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. మెగాస్టార్ ఎంట్రీపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ స్పందించారు. మామ చిరంజీవి ఎంట్రీని స్వాగతిస్తూ తనదైన శైలిలో కామెంట్ పోస్ట్ చేశారు. ''ట్విట్టర్ లోకి వచ్చిన మెగాస్టార్‌కి హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాను. చాలా రోజులుగా ఈ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం. ఫైనల్‌గా చిరంజీవి ఎంటర్ అయ్యారు'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
ఉగాది పండగ సందర్భంగా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన చిరంజీవి.. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి ట్వీట్ చేశారు. తన తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలందరితో అలాగే అత్యంత ప్రియమైన అభిమానులతో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఇకపోతే ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు కొరటాల శివ మూవీతో చిరంజీవి బిజీ అయ్యారు. ఇన్నిరోజులు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ రెండు సినిమాల షూటింగ్స్ కరోనా కారణంగా కొద్దిరోజుల పాటు వాయిదా పడ్డాయి.


Click it and Unblock the Notifications











