Unstoppable:అల్లు అర్జున్ ను నిలదీసిన బాలయ్య.. పవన్ కల్యాణ్ వివాదంపై తేల్చేసిన బన్నీ
గత కొంత కాలం నుంచి తెలుగు సినిమాకి చెందిన టాప్ మోస్ట్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ హీరోస్ నడుమ చిన్న పాటి కోల్డ్ వార్ జరుగుతుంది అనే టాక్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఆ కోల్డ్ వార్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చర్యలతోనే మొదలైంది అనే టాక్ మెగా అభిమానుల్లో బలంగా పాతుకుపోయింది. కానీ దీనిని గట్టిగా డిఫెండ్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులు నిజంగానే తనకి గట్టి ఆర్మీలా సోషల్ మీడియాలో అందరికీ సమాధానాలు అందిస్తున్నారు.
అయితే అసలు అల్లు వర్సెస్ మెగాగా మారిపోవడానికి ప్రధాన కారణం ఎక్కడ నుంచి కనిపిస్తుంది అంటే అది ఈ ఏడాదిలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలే అని చెప్పొచ్చు. కాగా పలు పార్టీల కోసం సినిమాకి చెందిన చాలా మంది ప్రచారాలకి స్టార్ కాంపైనర్స్ గా వెళ్లిన సంగతి తెలిసిందే.

కాగా ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో ఉండడంతో మెగా కుటుంబం చిరంజీవి నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరకు కూడా పవన్ కోసమే గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేశారు. ఇలా జరుగుతున్న తరుణంలో బాబాయ్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారం లోకి దిగాడు.
మరి ఇదంతా బాగానే ఉంది కానీ గత ఎన్నికల్లో పవన్ కోసం వచ్చిన అల్లు అర్జున్ ఈసారి కూడా పవన్ కోసం వస్తాడు అని చాలా మంది ఆశించారు. కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. పవన్ ఏదైతే పార్టీని గద్దె దింపాలని కంకణం కట్టుకొని కుర్చున్నాడో అదే పార్టీ కాండిడేట్ కి అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి ప్రచారం చేయడం దుమారానికి దారి తీసింది. పైగా దానికి తోడు తాను ఇచ్చిన పలు సమాధానాలు కూడా మెగా అభిమానులకి నచ్చలేదు.

మరి ఇంతలా కాంట్రవర్సీ రేపిన ఈ షాకింగ్ ఘటనపై బాలయ్య లాంటి స్టార్ బన్నీని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఇపుడు జరిగినట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నంద్యాల ఎన్నికల ఘటనపై తన ఫ్రెండ్ శిల్పా రవికి ఎందుకు సపోర్ట్ గా వెళ్ళావ్ అంటూ బాలయ్య టాక్ షో ఆహాలో ప్రసారం అయ్యే కొత్త సీజన్లో అల్లు అర్జున్ హాజరు కాగా ఇక్కడ బాలయ్య నుంచి మళ్ళీ ప్రశ్న ఎదురయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి దీనికి సమాధానంగా అల్లు అర్జున్ ఈసారికి మరో తరహా సమాధానం ఇచ్చినట్టుగా వినిపిస్తుంది. ఎవరి నడుమ అయినా భేదాభిప్రాయాలు ఉంటాయని అంతమాత్రాన వారి మధ్య ఇంకెప్పటికీ బంధాలు ఉండవా అన్నట్టుగా తెలిపాడట.. దీనితో ఈ టోటల్ కాంట్రవర్సీకి బాలయ్య షోతోనే తెర పడేలా ఉందని చెప్పాలి. కాగా ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అనే వివరాలు ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇక బన్నీ మాసివ్ పాన్ ఇండియా సీక్వెల్ పుష్ప 2 తో ఫుల్ బిజీగా ఉండగా ఈ చిత్రం ఈ డిసెంబర్ 6న గ్రాండ్ విడుదలకి రాబోతుంది.


Click it and Unblock the Notifications











