Unstoppable 4: పవన్ కల్యాణ్‌పై అల్లు అర్జున్ ఎవరూ ఊహించని కామెంట్.. బాలయ్యతో ఏం చెప్పాడంటే?

Allu Arjun in Unstoppable 4: మ్యాన్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK) సక్సెస్ పుల్ గా కొనసాగుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4లోని 4వ ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గెస్ట్ గా విచ్చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకెళ్తే..

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 నాలుగవ ఎపిసోడ్లో అల్లు అర్జున్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ కు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను , ప్రోమోను కూడా విడుదల చేసి.. షోపై అంచనాలను అమాంతం పెంచేశారు. గతకొన్ని రోజుల క్రితం విడుదలైన ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి ఫోటోను చూపించి.. చిరంజీవితో ఎలాంటి అనుబంధం ఉందో ? చెప్పమని బాలయ్య ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. చిరంజీవితో తనకు ఉన్న అనుబంధం, ప్రేమ, గౌరవం గురించి అల్లు అర్జున్ పంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Allu Arjun Comments on Pawan Kalyan in Balakrishna Unstoppable with NBK Season 4 Episod 4th

తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమోలో బాలకృష్ణ.. సెలెబ్రెటీ ఫోటోలను చూపిస్తూ.. వారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేయమన్నారు.ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించగానే.. కళ్యాణ్ గారు అంటు కాస్త ఎమోషనల్ అయినట్టు కనిపించారు బన్నీ. తన దారిలో తాను వెళ్ళిపోతాడని బాలయ్య అనగానే.. అంతే అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

గత కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ నాయకుడికి సపోర్ట్ చేయడం దుమారం రేగింది. రీసెంట్ గా మట్కా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ లో 'ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు ఎలా పైకి వచ్చామన్నది ముఖ్యం' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుణ్ తేజ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ నే టార్గెట్ చేసి అనుకున్నారు చాలామంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య షో లో అల్లు అర్జున్.. అల్లు - మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారని భావిస్తున్నారు.

మొత్తానికి 'అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ 4 లో అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ పై ఉత్కంఠ పెరిగిపోయింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఎలాంటి కామెంట్స్ చేశారనేది తెలియాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ ఎపిసోడ్ ఆహా లో రేపు (నవంబర్ 15న) స్రీమింగ్ కాబోతున్నది. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై క్యూరియసిటీని రెట్టింపు చేయడానికి ఇలాంటి ప్రొమోలు విడుదల చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇదెలా ఉంటే.. అల్లు అర్జున్ గతంలో కూడా అన్‌స్టాపబుల్ షో పాల్గొన్నారు. పుష్ప 1 మూవీ ప్రమోషన్స్ భాగంగా బన్నీతో పాటు రష్మిక, సుకుమార్ లు పాల్గొన్నారు. తాజాగా 'పుష్ప 2' ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ షో ను యూజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ షో నుంచే పుష్ప ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయనే టాక్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇదెలా ఉండే.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు, టీజర్, గ్లిమ్స్ , లీక్స్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. రూ.1,000 కోట్లకు పైగా పుష్ప ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరీ డిసెంబర్ 5 నుంచి బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ రూలింగ్ ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X