సమంతకు బాసటగా అల్లు అర్జున్ .. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌పై విమర్శలు చేసే క్రమంలో సినీనటులు అక్కినేని నాగచైతన్య, సమంతల పేర్లను తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రస్తావించడం తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించారు. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలను ఆయన నాశనం చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆ వివరాల్లోకి వెళితే..

గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో జాతిపితకు నివాళులర్పించిన మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి కొన్ని అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి, వారికి డ్రగ్స్ అలవాటు చేసి జీవితాలు నాశనం చేశాడని , హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడానికి కేటీఆరే కారణమంటూ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోవడం వెనుక కేటీఆర్ హస్తం ఉందని సురేఖ ఆరోపించారు.

Allu Arjun condemned telangana minister Konda Surekha comments on akkineni naga chaitanya and samantha ruth prabhu

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అటు సినీ పరిశ్రమ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. నాగార్జున, నాగచైతన్య, సమంత, జూనియర్ ఎన్టీఆర్, నాని సహా పలువురు ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. విడాకులు మా వ్యక్తిగత విషయమని.. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని సామ్, చైతూలు వేర్వేరు ట్వీట్‌లలో స్పష్టం చేశారు. మా కుటుంబం పట్ల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని అక్కినేని నాగార్జున డిమాండ్ చేశారు. బయటి వ్యక్తులు తమ పరిశ్రమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

Allu Arjun condemned telangana minister Konda Surekha comments on akkineni naga chaitanya and samantha ruth prabhu

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యవహారంపై స్పందించారు. మీడియాలో నిలిచేందుకు సినీ ప్రముఖులను సాఫ్ట్‌గా టార్గెట్ చేయడం సిగ్గుచేటన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై ఇలాంటి వ్యాఖ్యలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని.. ఉన్నత పదవుల్లో ఉన్న వారు తమ స్థాయిని దిగజార్చుకోకూడదని చిరంజీవి హితవు పలికారు.

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కూడా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని.. ఇది తెలుగు సంస్కృతి, విలువలకు విరుద్ధంగా .. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యలను అనుమతించకూడదని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. రాజకీయ పార్టీలు, నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని .. మహిళల వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచాలని బన్నీ సూచించారు. ప్రస్తుతం చిరు, అల్లు అర్జున్‌ల ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X