బన్నీ షాకింగ్ పోస్ట్ .. డిలీట్ చేసి, ఆపై మళ్లీ పోస్ట్ .. ఎందుకంత టెన్షన్?
గత కొన్ని నెలలు నుంచి తెలుగు సినిమా స్టార్ హీరోస్‌లో మెగా అండ్ అల్లు ఫ్యామిలీకి సంబంధించిన అభిమానుల నడుమ రచ్చ ఏ లెవెల్లో జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క ఇన్సిడెంట్ ఎంతో కలివిడిగా ఉండే మెగా అభిమానుల్లో పెద్ద చీలిక తీసుకొచ్చేసింది. నాటి నుంచి అల్లు అర్జున్ సహా పవన్ కళ్యాణ్ అభిమానులు , అల్లు అర్జున్ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానుల నడుమ రచ్చ నడుస్తూనే వస్తుంది.
అక్కడి నుంచి అది చాలా తీవ్ర పరిణామాలు దిశగా మారుతూ వెళ్ళింది. అయితే ఆఫ్ లైన్ లో మాత్రం అభిమానులు ఒక హీరోని కించపరుస్తూ ఫ్లకార్డులు , ఫ్లెక్సీలతో పెద్ద యుద్ధమే నడుస్తుంది అని చెప్పాలి. ఈ యుద్ధం ఇపుడు డైరెక్ట్ హీరో వరకు వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ అభిమానులు అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నడుమ కౌంటర్ కి రివర్స్ కౌంటర్ గా పలు ఫ్లెక్స్ లు అందులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్ధి శిల్ప రవికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడంపై ఆగ్రహంతో పవన్ అభిమానులు పాసింగ్ క్లౌడ్ అంటూ ఓ ఫ్లెక్స్ లో రెండు AA లు వచ్చేలా బన్నీకి కౌంటర్ వేశారు. దీని తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత ఘాటుగా స్పందించడం స్టార్ట్ చేశారు. అయితే ఈ మధ్య మాత్రం ఏకంగా పవన్ పార్టీ జెండా గుర్తులు పెట్టి మరీ దారుణంగా ట్రోల్ చేసేసరికి అది పెద్ద కాంట్రవర్సీ అయింది.
ఇలా ఇద్దరి హీరోస్ అభిమానుల నడుమ జరుగుతున్న పెంటలో ఇపుడు అల్లు అర్జున్ డైరెక్ట్ గా ఇన్వాల్ కావడం షాకింగ్ గా మారింది. నిన్న అల్లు అర్జున్ చెన్నైలో పుష్ప 2 కిస్సిక్ అనే సాంగ్ లాంచ్ కి వెళితే అక్కడ కూడా పవన్ ని కించపరిచే ఫ్లెక్స్ లు దర్శనం ఇచ్చాయి. అయితే ఇవి బన్నీ టీం నుంచే వెళుతున్నాయి అని పవన్ ఫ్యాన్స్ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇందులో ఓ పిక్ ని బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. తాను శ్రీలీల కలిసి ఉన్న పిక్ లో దూరంగా బ్లర్ గా ఓ అభిమాని ఫ్లెక్స్ పట్టుకొని కనిపిస్తాడు. ఇందులో ఏం పీకలేరు బ్రదర్ PK అంటూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ట్యాగ్ ఉంది. తొలుత అది పోస్ట్ చేసిన బన్నీ ఆ తర్వాత ఏమనుకున్నాడో దానిని డిలీట్ చేసేసాడు.
అనంతరం మళ్ళీ అదే పిక్ ని క్రాప్ చేసి పోస్ట్ చేసాడు. దీనితో ముందే పెట్టిన ఆ పోస్ట్ కాంట్రవర్సీకి దారి తీసింది. అల్లు అర్జున్ తెలిసి పెట్టాడో తెలీక పెట్టాడో కానీ ఇది మాత్రం డైరెక్ట్ హీరో నుంచే పోస్ట్ కావడంతో మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికే ఉన్న అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











